జేఎన్‌టీయూ హైదరాబాద్ అన్ని పరీక్షలు వాయిదా..

తెలంగాణ రాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా జేఎన్‌టీయూ హైదరాబాద్ ఈ నెల 29, 30 తేదీల్లో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. వాయిదా పడిన పరీక్షల నిర్వహణకు సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటిస్తామని అధికారులు పేర్కొన్నారు.

 

ఇదిలా ఉండగా, భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలోని బిక్కనూరు వద్ద ఎడ్లకట్ట వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు రహదారిపైకి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా కామారెడ్డి నుంచి హైదరాబాద్‌కు వెళ్లే నాగపూర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *