- చెట్లమొక్కలు నాటండి, వాతావరణాన్ని కాపాడండి- కాంగ్రెస్ పార్టీ ఆత్మ కమిటీ డైరెక్టర్ రాములు గౌడ్.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సూచనల మేరకు సదాశివపేట మున్సిపల్ కార్యాలయ సిబ్బంది కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ పాల్గొని చెట్ల యొక్క ప్రాముఖ్యత గురించి, చెట్లు లేనిది మనిషి యొక్క మనుగడ లేదని కొనియాడుతూ సదాశిపేట మున్సిపల్ కార్యాలయం వారు ఇచ్చే మొక్కలను ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఇంటింటా మరియు మన చుట్టుముట్టు పరిసరాల్లో మొక్కలు నాటి వాతావరణ కాలుష్యాన్ని నివారించే విధంగా పచ్చదనాన్ని పెంపొందించడం మనందరి బాధ్యతని తెలియజేశారు. ఇట్టి తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్మ కమిటీ డైరెక్టర్ రాములు గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ ఉత్తర్వుల మేరకు బాధ్యతాయుతంగా మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు అదేవిధంగా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అవసరాల నిమిత్తం కోసం మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని కొనియాడారు. ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ పి ఎ సి ఎస్ చైర్మన్ గడీలఆశిరెడ్డి గారు, లక్ష్మణ్ గారు, మున్సిపల్ కార్యాలయ వార్డ్ ఆఫీసర్ దశరథ్ గారు, గోపాల్ రెడ్డి గారు మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.