పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్‌’లో బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్‌’లో బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్ నటించబోతోందా..ప్రస్తుతం అవుననే మాట ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘సలార్‌’ను తెరకెక్కిస్తుండగా, శృతి హాసన్ హీరోయిన్ పాత్రలో కనిపించబోతోంది. ఇక ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ప్రభాస్‌కి విలన్‌గా ఓ ప్రముఖ నటుడిని ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ నటుడుని బాలీవుడ్ నుంచి తీసుకున్నారా లేక కోలీవుడ్ నుంచి తీసుకున్నారా అనే విషయం ఇంకా వెల్లడి కాలేదు. అయితే ఆ విలన్ పాత్రకి భార్యగా బాలీవుడ్ హాట్ హీరోయిన్ వాణీ కపూర్‌ని ఎంపిక చేసినట్టు టాక్ వినిపిస్తోంది. కథలో ఈమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందట. ఇదే నిజమైతే వాణీ కపూర్ దశ తిరిగినట్టే. ఎప్పుడో నాని నటించిన ‘ఆహా కళ్యాణం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మళ్ళీ తెలుగు సినిమాలలో ఇప్పటి వరకు కనిపించలేదు. బాలీవుడ్‌లో ఈమె నటించిన ‘శుధ్ దేశీ రొమాన్స్’, ‘బే ఫిక్రే’, ‘వార్’ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. ప్రస్తుతం వాణీ నటించిన మూడు హిందీ సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *