ఇటీవలే మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ లేటెస్ట్ వెర్షన్ విండోస్ 11ను విడుదల

ఇటీవలే మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ లేటెస్ట్ వెర్షన్ విండోస్ 11ను విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న పోటీని దృష్టిలో పెట్టుకొని ఈ ఒఎస్ ను రిలీజ్ చేసింది. విండోస్ 10 వాడుతున్న వారు 11ను ఉచితంగా అప్‌డేస్ చేసుకోవచ్చని మైక్రోసాఫ్ట్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక, ఇదిలా ఉంటే, తాజాగా కంపెనీ ఓ ప్రకటనను విడుదల చేసింది. విండోస్ వినియోగదారులంటా తమ కంప్యూటర్లను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని కోరింది. ఆపరేటింగ్ సిస్టమ్‌లో తీవ్రలోపం బయటపడటంలో ఈ దిగ్గజ టెక్ సంస్థ ఈ విధమైన ప్రకటన చేసింది.

కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో బయటపడిన తీవ్రమైన లోపాన్ని హ్యాకర్లు ఉపయోగించుకొని డేటాను చోరీ చేసే అవకాశం ఉందని, ఈ ముప్పునుంచి బయటపడాలి అంటే వెంటనే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేసుకోవాలని మైక్రోసాఫ్ట్ పేర్కొన్నది. ఒకే ప్రింటర్‌ను అనేక మంది అనేక కంప్యూటర్లతో కనెక్ట్ అయ్యి వినియోగిస్తుంటారు. దీనికోసం సిస్టమక్షలో ప్రింట్ స్పూలర్ అనే టూల్ ఉపయోగపడుతుంది. అయితే, ఇందులో భద్రతాపరమైన లోపాలు ఉన్నట్టు గుర్తించామని, ఈ లోపాన్ని అధికమించేందుకు తప్పనిసరిగా ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేసుకోవాలని దిగ్గజ టెకీ సంస్థ తెలిపింది. విండోస్ 10 తో పాటుగా, విండోస్ 7 లో కూడా ఈ లోపం ఉన్నట్టు మైక్రోసాఫ్ట్ సంస్థ పేర్కొన్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *