బ్యాడ్మింటన్‌ అగ్రశ్రేణి ఆటగాడు సాయిప్రణీత్‌ తనవంతుగా రూ. 4 లక్షలు విరాళం..

కరోనాపై పోరాటానికి మద్దతుగా భారత బ్యాడ్మింటన్‌ అగ్రశ్రేణి ఆటగాడు, హైదరాబాద్‌ ప్లేయర్‌ సాయిప్రణీత్‌ తనవంతుగా రూ. 4 లక్షలు విరాళం ఇచ్చాడు. గతేడాది ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన సాయిప్రణీత్‌… ప్రధానమంత్రి సహాయనిధికి రూ. 3 లక్షలు… తెలంగాణ సీఎం సహాయనిధికి రూ. 1 లక్ష వితరణ చేశాడు. కరోనా కట్టడి కోసం ఇప్పటి వరకు బ్యాడ్మింటన్‌ క్రీడాంశం నుంచి చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ (రూ. 26 లక్షలు), పీవీ సింధు (రూ. 10 లక్షలు), శ్రీకృష్ణప్రియ (రూ. 5 లక్షలు), కశ్యప్‌ (రూ. 3 లక్షలు) విరాళాలు ఇచ్చారు.  
హాకీ ఇండియా (హెచ్‌ఐ) ఇప్పటికే పీఎం–కేర్స్‌ రిలీఫ్‌ ఫండ్‌ కోసం కోటి రూపాయలు విరాళం ప్రకటించగా… తాజా ఒడిశా సీఎం సహాయనిధికి రూ. 21 లక్షలు ఇచ్చింది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *