వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ స్కామ్‌లో మాజీ సీఎం జగన్ పాత్ర ఉందని అనుబంధ ఛార్జిషీట్‌లో ప్రస్తావించింది సిట్. సేకరించిన ముడుపులను బిగ్‌బాస్‌కు చేరవేయడంలో ముగ్గురు వ్యక్తులు కీలకపాత్ర పోషించినట్టు ప్రస్తావించింది. త్వరలో వేయబోయే ఛార్జిషీటులో ఎలాంటి విషయాలు ప్రస్తావిస్తుందోనన్న ఆసక్తి అందరిలోనూ మొదలైంది.