మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..! ఆ బిల్ విత్ డ్రా..

కేంద్రంలోని మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో లోక్ సభలో ప్రవేశ పెట్టిన ఆదాయపు పన్ను (ఐటీ) బిల్లు- 2025కు ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది.

 

ఆదాయపు పన్ను చట్టం 1961 స్థానంలో ఆదాయపు పన్ను బిల్లు- 2025ను మోదీ సర్కార్ లోక్ సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కానీ ఈ బిల్లును ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. ఈ క్రమంలోనే కొత్త ఇన్ కాం ట్యాక్స్ బిల్లు విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. త్వరలో కొత్త బిల్లును తీసుకురానుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న లోక్ సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లును కేంద్రం విత్ డ్రా చేసుకుంది. చట్టంగా మారక ముందే కేంద్రం వెనక్కి తీసుకంది.

 

బిల్లులోని కొన్ని నిబంధనలపై ఆందోళనలతో కేంద్రం వెనక్కి తగ్గింది. అసిస్ మెంట్ ఇయర్ ను ట్యాక్స్ ఇయర్ గా మార్చడం డిజిటల్ అసెట్స్ పై ట్యాక్స్ రూల్స్ తో ఆందోళన నెలకొంది. ట్యాక్స్‌ పేయర్‌ చార్టర్‌తో పన్ను చెల్లింపుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపాదిత బిల్లులోని కొన్ని రూల్స్‌పై ట్యాక్స్‌ పేయర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

 

అలాగే.. బిల్లుపై కేంద్రం నియమించిన సెలెక్ట్ కమిటీ అధ్యయనం చేసింది. చివరకు జులై 21న కమిటీ అధ్యయనం చేసిన రిపోర్టును పార్లమెంట్ పంపించింది. మొత్తం 4500 పేజీలతో ఉన్న ఈ రిపోర్టులో ముసాయిదా బిల్లుకు 285 ప్రతిపాదనలు చేస్తూ ఫైనల్ నివేదికను కేంద్రానికి అందజేసింది. వీటిని పరిగణలోకి తీసుకున్న కేంద్రం.. ఈ క్రమంలోనే కొత్త బిల్లును ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కొత్త బిల్లును ఆగస్టు 11న లోక్ సభలో ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *