ఆగస్ట్ 6న ఢిల్లీలో ధర్నా..! మంత్రి పొన్నం పిలుపు..

తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ జాప్యంపై కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రపతి కలిసే యోచనలో రాష్ట్రప్రభుత్వం ఉంది. రిజర్వేషన్లు తేలాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రిజర్వేషన్లపై మంత్రులు ఇండియా కూటమి మద్దతు కోరుతామని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ జాప్యంపై కేబినెట్ లో చర్చించామని అన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ జులై 14న గవర్నర్ కి పంపామని చెప్పారు. ‘ఆర్డినెన్స్ పై గవర్నర్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాం. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల బిల్లు కూడా ఆమోదించి గవర్నర్ కి పంపాం. రిజర్వేషన్లపై ఇండియా కూటమి మద్దతు కోరనున్నాం’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.

 

గవర్నర్ బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ను రాష్ట్రపతికి పంపారు. ఎన్నికలకు ఆలస్యమైతే స్థానిక సంస్థల నిధులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. బీజేపీ నాయకులు బీసీ రిజర్వేషన్ల కోసం సహకరించాలని కోరుతున్నాం. ఆగస్ట్ 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో నిరసనకు నిర్ణయం తీసుకున్నాం. న్యాయపరమైన చిక్కులు రాకుండా కులగణన చేశాం. అన్ని పార్టీలు బీసీ రిజర్వేషన్లకు సహకరించాలి. మాతో పాటు వచ్చి ఢిల్లీలో నిరసనలో పాల్గొనాలి. న్యాయపరమైన చిక్కులు రాకుండా కులగణన చేశాం’ అని మంత్రి పొన్నం అన్నారు.

 

బీజేపీ నాయకులు బీసీ రిజర్వేషన్ల కోసం సహకరించాలని కోరుతున్నాం. అలాగే రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కూడా అడుగుతున్నాం. ఇండియా కూటమి ఎంపీలను కూడా కలుస్తాం. సీఎం రేవంత్ సహా అంతా ఢిల్లీకి వెళ్తున్నాం. ఆగస్ట్ 6న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగుతున్నాం. అన్ని పార్టీలకు రిక్వెస్ట్ చేస్తున్నాం. బిసీ రిజర్వేషన్ల బిల్లుకు అందరూ సహకరించాలి’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *