పశ్చిమ గోదావరి జిల్లా దేవదాయశాఖ అధికారులకు హైకోర్టు.. కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. దేవదాయ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, ద్వారకాతిరుమల ఈవోకు హైకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. 27శాతం మధ్యంతర భృతి అమలు చేయడం లేదంటూ హైకోర్టులో ఎన్‌ఎంఆర్‌లు పిటిషన్ దాఖలు చేశారు. మధ్యంతర భృతి అమలు చేయాలని డిసెంబర్‌లో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులను దేవదాయ శాఖ అధికారులు అమలు చేయడం లేదు. దీంతో అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసి.. ఈ నెల 21న హాజరుకావాలని ఆదేశాలిచ్చింది.