ఆగస్ట్ 15 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని సీఎం జగన్ తెలిపారు. ఈలోపు టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థుల నిష్పత్తికి తగినట్లుగా టీచర్లు ఉండాలన్నారు. ఇవాళ విద్యారంగంలో నాడు-నేడుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. నూతన విద్యావిధానం ప్రతిపాదనలను ఈవారంలో ఖరారు చేయాలన్నారు. నాడు-నేడు పనులు యాథావిధిగా కొనసాగించాలని చెప్పారు.