దేశీయంగా సర్వీసులు అందించే విమానయాన సంస్థలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రోజు వారీ కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. చాలా రాష్ట్రాలు కరోనా ఆంక్షలను సడలిస్తున్నాయి. ఫలితంగా దేశీయంగా ప్రయాణించే విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 50 శాతం సామర్థ్యంతో దేశీయ ప్రయాణాలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం తాజాగా మరింత సడలింపు ఇచ్చింది. ఇకపై 65 శాతం సామర్థ్యంతో సర్వీసులకు అనుమతినిచ్చింది. జులై 31 వరకు, లేదంటే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తాజా ఆదేశాలు అమల్లో ఉంటాయి.