భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా వివిధ రాజకీయ నేతలకు బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా 2600 కేజీల మామిడి పండ్లను బహుమతిగా పంపారు

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా వివిధ రాజకీయ నేతలకు బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా 2600 కేజీల మామిడి పండ్లను బహుమతిగా పంపారు. బంగ్లా నుంచి ఒక ట్రక్కులో బయల్దేరిన ఈ ‘హరిబంగ’ రకం మామిడి పళ్లు.. కోల్‌కతాలోని బంగ్లా అధికారులకు చేరాయి. వీటిని మోదీతో పాటు.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఇతర రాజకీయ నేతలకు పంచనున్నారు. భారత్‌తో స్నేహ సంబంధాలకు గుర్తుగా ఈ మామిడి పండ్లను హసీనా పంపినట్లు బంగ్లా అధికార వర్గాలు తెలిపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *