డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికామ్ (DoT) టెలికామ్ మార్కెటర్స్‌కు కొత్త నిబంధనలు ఇష్యూ చేసింది. 50కు మించి నిబంధనలు అతిక్రమించి మెసేజ్ లేదా కాల్ చేస్తే రూ.10వేలు ఫైన్ కట్టాలని అధికారిక స్టేట్మెంట్ విడుదల చేసింది. 0-10 నిబంధనలు దాటితే రూ.1000 ఫైన్, 10-50 దాటితే రూ.5వేలు ఫైన్, 10-50 దాటితే రూ.10వేలు ఫైన్ కట్టాల్సిందే.
ప్రస్తుతమున్న టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫెరెన్స్ రెగ్యూలేషన్స్ (టీసీసీసీపీఆర్)2018 ఆధారంగా 0-100, 100-1000అంతకంటే ఎక్కువ నిబంధనలు అనే స్లాబ్స్ మాత్రమే ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. డిజిటల్ ఇంటిలిజెన్స్ యూనిట్ (DIU) డివైజ్ లెవల్ లో చెక్ చేసి నిబంధనలను అమలుపరుస్తోంది.
ఒకవేళ రీ-వెరిఫికేషన్ జరగని నెంబర్లు ఉంటే.. డిస్కనెక్ట్ చేయడమే కాకుండా ఆ ఐఎమ్ఈఐ నెంబర్లను అనుమానితుల జాబితాలో చేరుస్తారు. అటువంటి నెంబర్ల నుంచి ఫోన్లు వెళ్లకుండా 30రోజుల పాటు నిషేదం విధిస్తారు. కొత్త కనెక్షన్ నుంచి ఏదైనా కమ్యూనికేషన్ వస్తే ఐఎమ్ఈఐ నెంబర్ రికార్డ్ చేసుకుని గ్రే లిస్ట్ కింద ఫైల్ చేసి రీ వెరిఫికేషన్ కోసం పంపిస్తారు.
నిబంధనలు అతిక్రమించడం కొనసాగితే.. ఆ ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్ ను రెండేళ్ల పాటు బ్లాక్ చేసేస్తారని అధికారికంగా వెల్లడించింది.