బాలీవుడ్ రామాయణ నుండి కాజల్ ఔట్..! కారణం అదేనా..? క్రేజీ బ్యూటీకి ఛాన్స్..!

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారీ (Nitesh Tiwari)దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం రామాయణ (Ramayan)ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా మొదటి భాగానికి సంబంధించిన ఒక గ్లింప్ వీడియో విడుదల చేశారు. ఇలా ఈ సినిమాలో నటిస్తున్న నటీనటుల పాత్రలను పరిచయం చేస్తూ విడుదల చేసిన ఈ వీడియో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో రాముడిగా బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్(Ranbir Kapoor) నటిస్తుండగా సీత పాత్రలో నటి సాయి పల్లవి (Sai Pallavi)నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో రావణాసురుడి పాత్రలో కేజిఎఫ్ స్టార్, పాన్ ఇండియా హీరో యశ్ (Yash)నటిస్తున్న సంగతి తెలిసిందే.

 

రామాయణలో భాగమైన మృణాల్..

 

ఇకపోతే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇతర భాష సెలబ్రిటీలు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. అయితే రావణాసురుడి భార్యగా, మండోదరి పాత్రలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) నటించబోతున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఈమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారని సమాచారం. కాజల్ అగర్వాల్ పలు కారణాలవల్ల ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో మండోదరి పాత్రలో మరో నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలు గురించి చిత్ర బృందం ఎక్కడ స్పందించలేదు.

 

ప్రాధాన్యత లేని పాత్రలు..

 

ఇకపోతే కాజల్ అగర్వాల్ పెళ్లి జరిగిన తర్వాత పలు సినిమాలకు కమిట్ అవుతున్న ఆమె పాత్రలకు మాత్రం పెద్దగా ప్రాధాన్యత లభించడం లేదని చెప్పాలి. ఇలా ప్రాధాన్యత లేని పాత్రలు వస్తున్న నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి తప్పుకున్నారని సమాచారం. ఇక ఈ సినిమాలో యష్ పాత్ర కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉండబోతుందని తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తుంటే కాజల్ మండోదరి పాత్రకు కూడా పెద్దగా ప్రాధాన్యత ఉండదని అందుకే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారని అభిమానులు భావిస్తున్నారు. ఇకపోతే ఈ పాత్రకు మృణాల్ ఎంపిక కావడం అనేది విశేషం. ప్రస్తుతం వరస ప్రాజెక్టులకు ఎంతో బిజీగా ఉన్న మృణాల్ రామాయణంలో భాగం కాబోతున్న నేపథ్యంలో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

బీప్ తినే వ్యక్తి రాముడు…

 

ఇకపోతే ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నటిస్తున్న నేతత్వంలో ఈయన పట్ల ఎన్నో విమర్శలు వచ్చాయి. బీప్ తినే వ్యక్తి రాముడిగా నటించడం ఏంటి అంటూ ఎంతో మంది విమర్శలు కురిపించారు. ఈ విధంగా రణబీర్ కపూర్ పాత్ర గురించి విమర్శలు వస్తున్న నేపథ్యంలో డైరెక్టర్ నితీష్ తివారి స్పందిస్తూ… రాముడి పాత్రలో రణబీర్ కపూర్ ను తీసుకోవటనికి కారణం లేకపోలేదని, అతని మొహంలో ఎల్లప్పుడూ ప్రశాంతత కనిపిస్తుందని, రాముడి పాత్రకు ఈయన సరిగ్గా సూట్ అవుతారన్న ఉద్దేశంతోనే తనని ఎంపిక చేసాము అంటూ ఇటీవల క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో రాముడి పాత్రలో నటించడం కోసం రణబీర్ కపూర్ ఏకంగా రూ.150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *