మెడికల్ కాలేజీలో లైంగిక వేధింపుల కలకలం.. సీఎం చంద్రబాబు సీరియస్..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రంగరాయ వైద్యకళాశాల ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించి ఆ శాఖ అధికారులు నివేదిక అందజేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అసలేం జరిగింది?

 

మెడికల్ కాలేజీలు రేపో మాపో ఓపెన్ కానున్న నేపథ్యంలో విద్యార్థులపై వేధింపులు ఘటన కలకలం రేపుతున్నాయి. తాజాగా కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో విద్యార్థునులపై లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం రేపాయి. దాదాపు 50 మంది పారా మెడికల్ విద్యార్థినులపై ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి, మరో ఉద్యోగి అసభ్యకర ప్రవర్తించారు.

 

ఆపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు తీవ్రమయయాయి. సెల్‌ఫోన్‌ల్లో వారి ఫోటోలు తీసి బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడినట్లు బాధిత విద్యార్థినులు ఫ్యాకల్టీ వద్ద చెప్పుకుని కన్నీరుమున్నీరు అయ్యారు. తాము శాశ్వత ఉద్యోగులమని, తనను ఎవరూ ఏమీ చేయలేరని ల్యాబ్ సహాయకుడు ఒకడు విద్యార్థినులను బెదిరించినట్టు తెలుస్తోంది.

 

ఈ క్రమంలో పైస్థాయి అధికారులకు ఫిర్యాదులు వెల్లాయి. దానిపై విచారణ చేపట్టారు. ల్యాబ్ అసిస్టెంట్లు విధులకు మద్యం తాగి వస్తున్నారని విచారణ కమిటీకి బాధిత విద్యార్థులు తెలిపారు. అయితే, తాము ఎవరి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించలేదని, విద్యార్థుల ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు ఉద్యోగులు. వేధింపుల వ్యవహారం నిజమేనని తేలింది.

 

చక్రవర్తితోపాటు మరో ముగ్గురు విద్యార్థినులను వేధించినట్లు అధికారుల విచారణలో బయటపడింది. విద్యార్థునులపై వేధింపు వ్యవహారం తెలియగానే సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి వైద్య శాఖ అధికారులు నివేదిక అందించారు. నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు ముఖ్యమంత్రి.

 

ఆరోపణలు నిజమని తేలడంపై వారిపై కఠిన చర్యలు సిద్ధమయ్యారు అధికారులు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంతో విద్యా సంస్థల్లో మహిళల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. దేశంలో వివిధ విద్యాసంస్థల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని నిపుణులు సూచన చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *