మరోసారి హాట్ టాపిక్ గా సమంత, రాజ్‌ రిలేషన్‌షిప్‌..? వైరల్ అవుతున్న ఫోటో..

ప్రముఖ నటి సమంత వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె ప్రేమలో ఉన్నారంటూ కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు తాజా పరిణామాలు మరింత బలాన్నిస్తున్నాయి. ప్రస్తుతం అమెరికాలో విహారయాత్రలో ఉన్న సమంత, రాజ్‌తో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో వారి మధ్య ఉన్న సంబంధంపై మళ్లీ చర్చ మొదలైంది.

 

వివరాల్లోకి వెళితే.. సమంత తన అమెరికా ట్రిప్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తన స్నేహితులతో కలిసి ఉన్న ఈ చిత్రాలలో రాజ్ నిడిమోరుతో ఆమె చాలా సన్నిహితంగా కనిపించడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ ఫొటోలను చూసిన పలువురు అభిమానులు, నెటిజన్లు వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని భావిస్తూ ‘కంగ్రాట్స్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. “మీరు అదృష్టవంతులు కారు.. మీ కష్టానికి ప్రతిఫలం దక్కింది” అనే ఓ కొటేషన్‌ను కూడా సమంత ఈ ఫొటోలకు జత చేశారు.

 

రాజ్-డీకే ద్వయం దర్శకత్వంలో వచ్చిన ‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2’, ‘సిటడెల్: హనీ బన్నీ’ వంటి ప్రాజెక్టులలో సమంత నటించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌ల చిత్రీకరణ సమయంలోనే రాజ్ నిడిమోరుతో ఆమెకు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అంతేకాకుండా ఇటీవల సమంత నిర్మించిన ‘శుభం’ చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా పనిచేశారు. ఈ వృత్తిపరమైన బంధమే వారి మధ్య ప్రేమాయణానికి దారితీసిందనే ప్రచారం జరుగుతోంది.

 

కొన్ని రోజుల క్రితం తనపై వస్తున్న వార్తలను ఉద్దేశించే అన్నట్లుగా, “ఇతరుల మాటలు పట్టించుకోకుండా నిబ్బరంగా ఉండాలి. జరగాల్సింది జరగనివ్వాలి” అంటూ సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ తాత్వికమైన పోస్ట్ పెట్టారు. ఇప్పుడు రాజ్‌తో ఫొటోలు బయటకు రావడంతో ఈ డేటింగ్ వార్తలు మరోసారి ఊపందుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *