టీచర్ ఉద్యోగాలు కోరుకునే వారికి ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ మరోగుడ్ న్యూస్ చెప్పింది. ఈ బోర్టు ద్వారా రిక్రూట్ చేయబోతున్న 5807 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు 2021 జూలై 10 వరకు పొడిగించింది. అంతకు ముందు ఈ నోటిఫికేషన్ దరఖాస్తుల గడువు జూలై 3న ముగిసింది. ఆ సక్తిగల అభ్యర్థులు 2021 జూలై 10 లోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 5,807
విభాగాల వారీగా ఖాళీలు: టీజీటీ సంస్కృతం ఫీమేల్- 1,159, టీజీటీ ఇంగ్లీష్ ఫీమేల్- 961, టీజీటీ పంజాబీ ఫీమేల్- 492, టీజీటీ ఉర్దూ ఫీమేల్- 571, టీజీటీ బెంగాలీ ఫీమేల్- 1, టీజీటీ ఇంగ్లీష్ మేల్- 1,029, టీజీటీ సంస్కృతం మేల్- 866, టీజీటీ ఉర్దూ మేల్- 346, టీజీటీ పంజాబీ మేల్- 382 పోస్టులున్నాయి.
అర్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి బ్యాచిలర్స్ డిగ్రీ కనీసం 45 శాతం మార్కులతో పాస్ కావాలి. అభ్యర్థుల వయస్సు 32 ఏళ్లు.
దరఖాస్తు ఫీజు రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.
ఎంపిక విధానం: టియర్ 1, టియర్ 2 ఎగ్జామ్, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులను https://dsssb.delhi.gov.in/ లేదా https://dsssbonline.nic.in/ వెబ్‌సైట్లలో అప్లై చేయాలి.