కొన్ని కొన్ని సార్లు ప్రభుత్వ డిపార్ట్మెంట్ పనులు జరగక ప్రజలు బాధపడుతూ ఉంటారు

కొన్ని కొన్ని సార్లు ప్రభుత్వ డిపార్ట్మెంట్ పనులు జరగక ప్రజలు బాధపడుతూ ఉంటారు. అయితే ప్రభుత్వ డిపార్ట్మెంట్లో పనులు జరగక పోయినప్పుడు అధికారులకు ఫిర్యాదు చేస్తూ ఉంటారు చాలా మంది. అయినా సరే ఒక్కొక్క సారి పనులు పూర్తి అవ్వవు. అలాంటి సమయంలో చాలా మంది ప్రధానమంత్రి (Prime Minister) ఆఫీస్ కి డైరెక్ట్ గా లేఖ రాయాలి అని అనుకుంటూ ఉంటారు. అలా చేస్తే తప్పకుండా పనులు పూర్తవుతాయని అంటుంటారు.

ప్రధానమంత్రి/ Prime Minister
నిజంగా అటువంటి సమస్య మీకు ఏమైనా ఉంటే.. మీ కంప్లైంట్ ని ప్రధానమంత్రి ఆఫీస్ కి పంపించాలి అనుకుంటే నిజంగా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. అది కూడా ఇంట్లో ఉండి ఆన్లైన్ ద్వారా పంపించవచ్చు.
మీరు కనుక ఫిర్యాదు చేస్తే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. పీఎం ఆఫీస్ కి ఎలా ఫిర్యాదు చేయాలి అంటే…? ముందుగా మీరు ప్రధానమంత్రి ఆఫీస్ వెబ్ సైట్ కి https://www.pmindia.gov.in/hi వెళ్లి డ్రాప్ డౌన్ మెనూ లో ఇంటరాక్ట్ విత్ ప్రైమ్ మినిస్టర్ అని ఉంటుంది.. అక్కడ రైట్ టు ద ప్రైమ్ మినిస్టర్ అది ఉంటుంది దీని ద్వారా మీరు ఏమైనా కంప్లైంట్ పెట్టొచ్చు.

ప్రైమ్ మినిస్టర్ వెబ్ సైట్ దగ్గర ఈ లింక్ మీకు కనబడుతుంది www.pmindia.gov.in/hi. ఇది అయిపోయిన తర్వాత CPGRAMS అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు.కంప్లెయింట్ రిజిస్టర్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. అక్కడ అవసరమైన డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయాలి.

అక్కడ ఫిల్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా రాయాల్సి ఉంటుంది. అక్కడ మీరు రాసేసి సెండ్ చేయొచ్చు లేదు అంటే మీరు పోస్టు ద్వారా కూడా పంపించవచ్చు.

దీనికోసం మీరు లేఖ రాసేసి ఈ అడ్రస్ కి పంపించాలి. Prime Minister’s Office, South Block, New Delhi, Pin – 110011. Also for sending complaints through Fax, FAX No. Send it to 011-23016857. ఇలా మీరు పంపిస్తే ఫిర్యాదు తీసుకుని సమస్యకి పరిష్కారం ఇస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *