జోగు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమం రికార్డులకెక్కింది

ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న పుట్టినరోజు సందర్భంగా జోగు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమం రికార్డులకెక్కింది. పట్టణ శివారు దుర్గానగర్‌లోని 250 ఎకరాల అటవీ ప్రాంతంలో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో 35 వేల మంది గంటలో మూడున్నర లక్షల మొక్కలు నాటారు. దాంతో టర్కీలో గతంలో 3.2 లక్షల మొక్కలు నాటిన రికార్డును అధిగమించి వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌కెక్కిందని ఆ సంస్థ ఇండియా ప్రతినిధి మీ నరేందర్‌గౌడ్‌ తెలిపారు. ఈ మేరకు ధ్రువీకరణ పత్రం, మెడల్‌ను ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ప్రజాప్రతినిధులకు గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మొత్తంగా జిల్లావ్యాప్తంగా పది లక్షల మొక్కలు నాటినట్టు తెలిపారు. జోగినపల్లి సంతోష్‌కుమార్‌ మాట్లాడుతూ ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా లెక్కల ప్రకారం రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 24 శాతం నుంచి 27 శాతానికి చేరిందన్నారు. అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు రూ.6 వేల కోట్లు కేటాయించామన్నారు.

హైదరాబాద్ : ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న పుట్టినరోజు సందర్భంగా జోగు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమం రికార్డులకెక్కింది. పట్టణ శివారు దుర్గానగర్‌లోని 250 ఎకరాల అటవీ ప్రాంతంలో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో 35 వేల మంది గంటలో మూడున్నర లక్షల మొక్కలు నాటారు. దాంతో టర్కీలో గతంలో 3.2 లక్షల మొక్కలు నాటిన రికార్డును అధిగమించి వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌కెక్కిందని ఆ సంస్థ ఇండియా ప్రతినిధి మీ నరేందర్‌గౌడ్‌ తెలిపారు. ఈ మేరకు ధ్రువీకరణ పత్రం, మెడల్‌ను ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ప్రజాప్రతినిధులకు గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ అందించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మొత్తంగా జిల్లావ్యాప్తంగా పది లక్షల మొక్కలు నాటినట్టు తెలిపారు. జోగినపల్లి సంతోష్‌కుమార్‌ మాట్లాడుతూ ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా లెక్కల ప్రకారం రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 24 శాతం నుంచి 27 శాతానికి చేరిందన్నారు. అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు రూ.6 వేల కోట్లు కేటాయించామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *