రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గురువారం కురిసిన అకాల వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. కోత కు వచ్చిన వరి పైర్లు నేలకొరిగాయి. కొన్ని చోట్ల మామిడి తోట లకు నష్టం వాటిల్లింది. ఇతర పంటలు కూడా దెబ్బతిన్నాయి.
► ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాల్వంచ, అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట, మణుగూరు, అశ్వాపురం, సత్తుపల్లి మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తో పాటు కల్లాల్లోని మిర్చి, మొక్కజొన్న పంట తడిసిపోయిం ది. కొన్నిచోట్ల మామిడి కాయలు నేలరాలాయి.
► సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. కొమురవెళ్లి మండలంలో వడగళ్లు పడ్డాయి. నంగునూరులో ధాన్యం నేలరాలింది. గజ్వేల్ మండలంలో వరి, మామిడితోటలకు నష్టం జరిగింది.