ప్రపంచ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన మహిళా బ్యాటర్‌గా మిథాలీ రాజ్ రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి మిథాలీ 10,342 పరుగులు చేసింది. గతంలో ఇంగ్లాండ్ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ 10273 పరుగులతో ఈ రికార్డు ఉన్నది. శనివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డును అధిగమించింది.
మహిళా క్రికెట్‌లో ఇప్పుడు అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన క్రికెటర్‌గా మిథాలీ సరికొత్త రికార్డు సృష్టించింది. మిథాలీ రాజ్ మొత్తం 10,342 పరుగులు చేయగా.. ఇందులో 669 పరుగులు టెస్టుల్లో, 7304 పరుగులు వన్డేల్లో, 2364 పరుగులు వన్డేల్లో చేసింది. వన్డేల్లో అత్యధిక పరుగులు (7304) చేసిన రికార్డు కూడా మిథాలీ పేరిటే ఉన్నది. అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లు గా పురుషుల్లో సచిన్ టెండుల్కర్ (34357), మహిళల్లో మిథాలీ రాజ్ (10273) నిలిచారు.