ప్రకాశం బ్యారేజీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి 803 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పులిచింతలలో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ.. 7వేల క్యూసెక్కుల నీరును దిగువకు విడుదల చేస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు బ్యారేజీ నుంచి 8,300 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు.