69 మందితో.. పీసీసీ కొత్త కార్యవర్గం లిస్ట్ ఇదే..!

ఎట్టకేలకు టీపీసీపీ కార్యవర్గం ఏర్పాటైంది. కానీ కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్లు లేకుండానే కార్యవర్గాన్ని ప్రకటించారు. టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రటరీ పదవులను భర్తీ చేసింది. ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. 27 మంది ఉపాధ్యక్షులకు టీపీసీసీ కార్యవర్గంలో చోటు కల్పించారు. 69 మందిని టీపీసీసీ ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. జనరల్ సెక్రటరీలుగా ఎమ్మెల్యేలు వెడ్మబొజ్జ, మట్టా రాగమయి, పర్నికా రెడ్డి నియమితులయ్యారు.

 

ఉపాధ్యక్షులుగా ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణరెడ్డి, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, బస్వరాజు సారయ్యతో పాటు గాంధీభవన్‌లో కీయాశీలకంగా పనిచేసే సీనియర్ నాయకుడు టీ కుమార్ రావు, పాలకుర్తి సీనియర్ కాంగ్రెస్ నేత ఝన్సీరెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, గాలి అనిల్ కుమార్, కోమటిరెడ్డి వినయ్ కుమార్, బండి రమేశ్, ఆత్రం సుగుణ, కొండ్రు పుష్ఫలీలతో పాటు మరొకొందరి అవకాశం కల్పించారు.

 

ఇక 27 మంది ఉపాధ్యక్షులలో బీసీలకు 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, ముస్లింలకు 3 పదవులు ఇచ్చారు. ఓవరల్‌గా 67శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చినట్లు ప్రకటించారు. ఇక 69 ప్రధాన కార్యదర్శ పదవులలో బీసీలకు అత్యధికంగా 26, ఎస్టీలకు 4, ముస్లింలకు 8 పదవులుగా ఇవ్వగా.. 68 శాతం ఆయా వర్గాలకు ఇచ్చినట్లు టీపీసీసీ స్పష్టం చేసింది.

 

టీపీసీసీ నూతన కార్యవర్గంలో ఒక ఎంపీ, ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలకు అవకాశం దక్కింది. టీపీసీసీ నూతన కార్యవర్గంలో అధిష్టానం సామాజిక న్యాయం పాటించింది. ఏకపక్షంగా కాకుండా అన్ని వర్గాలకు చోటు కల్పించింది. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు లేకుండానే టీపీసీసీ కమిటీ ప్రకటించింది ఏఐసీసీ. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్‎కు భారీగా పోటీ ఉండటంతో ప్రస్తుతం ఈ నియామకాలను ఏఐసీసీ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

 

తెలంగాణ పాలిటిక్స్‎లో మంత్రి వర్గ విస్తరణ, టీపీసీసీ నూతన కార్యవర్గం ఈ రెండు అంశాలు గత కొద్ది నెలలుగా.. పెండింగ్‎లో ఉన్న సంగతి తెలిసిందే. 15 నెలలుగా ఇవాళ, రేపు అంటూ ప్రచారం జరిగింది. జిల్లాల ప్రాతినిధ్యం, సామాజిక సమీకరణాలు, సీనియార్టీ, లాయల్టీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని మంత్రి వర్గ విస్తరణ, టీపీసీసీ నూతన కార్యవర్గం ఎంపికపై టీపీసీసీ, ఏఐసీసీ తీవ్ర కసరత్తు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *