క్యాష్‌బ్యాక్‌ రూపంలో రివార్డులు అందించేందుకు రూ.50 కోట్లు

పేటీఎం అనే పదం తెలియని వాళ్లు ఉండరేమో. దాదాపు చదువుకున్నా వళ్లకు, చదువుకోని వాళ్లకు ఈ పదం తెలిసే ఉంటుంది. అంతగా పాపులారిటీ తెచ్చుకుంది. మొదట వాలెట్ రూపలంలో వచ్చిన ఈ పేటీఎం తర్వాత పేటీఎం బ్యాంకుగా.. పేటీఎం బిజినెస్ యాప్ గా పలు సౌకర్యాలను వినియోగదారులకు అందించింది. అయితే డిజిటల్‌ ఇండియా కార్యక్రమం ప్రారంభమై ఆరేళ్లయిన నేపథ్యంలో ప్రముఖ ఈ సంస్థ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. వ్యాపారులు, వినియోగదారులకు క్యాష్‌బ్యాక్‌ రూపంలో రివార్డులు అందించేందుకు రూ.50 కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది. పేటీఎం యాప్‌ ద్వారా లావాదేవీలు జరిపే ప్రతిఒక్కరికీ ప్రయోజనాలు అందుతాయని పేర్కొంది. దేశంలోని 200 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది. ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళలో స్పెషల్‌ డ్రైవ్స్‌ చేపట్టనున్నట్లు వెల్లడించింది. డిజిటల్‌ చెల్లింపుల సాధనాలను విస్తృతంగా వినియోగించి డిజిటల్‌ ఇండియాను విజయవంతం చేయడంలో వ్యాపారులు కీలక పాత్ర పోషించారని సంస్థ పేర్కొంది. దీపావళి వరకు పేటీఎం యాప్‌ ద్వారా అత్యధిక లావాదేవీలు జరిపిన వ్యాపారులకు రివార్డులను కూడా ప్రకటించనుందని తెలిపింది. దుకాణాల వద్ద క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి చెల్లింపులు చేసే ప్రతి లావాదేవీకి వినియోదారులకు క్యాష్‌బ్యాక్ వస్తుందని పేర్కొంది. పేటీఎం బిజినెస్‌ యాప్‌ వాడుతున్న వ్యాపారస్థుల్లో ఎంపిక చేసిన వారికి ఆడియో డివైజ్, సౌండ్‌బాక్స్ 50 శాతం రాయితీకి అందజేస్తామని వెల్లడించింది. మరిన్ని ప్రయోజనాలు కూడా అందే అవకాశం ఉందని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *