పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా… ప్రస్తుత నీటి నిల్వ 25.86 టీఎంసీలుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 175అడుగులకు గాను… ప్రస్తుత నీటిమట్టం 160.20 అడుగులకు చేరింది. అలాగే ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 39700 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 7200 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. విద్యుత్ ఉత్పాదన కోసం 4600 క్యూసెక్కులు నీటిని వినియోగిస్తున్నారు. రెండు యూనిట్ల ద్వారా 30 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన జరుగుతోంది.