రాజధాని నగరం చెన్నైలో అన్నానగర్, వేళచ్చేరి, రాయపురం, నుంగంబాక్కం సహా పది ప్రాంతాల్లో కొత్తగా ఫ్లై ఓవర్లు నిర్మించనున్నారు. నగరంలోని ప్రధానమైన రహదారులను కూడా విస్తరింపజేయనున్నారు. ఈ పన్నులన్నీ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన జరుగనున్నాయి. నగరంలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఏర్పాడే ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు నిర్మించాలని కార్పొరేషన్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ చెన్నై నగర మేయర్‌గా ఉన్నప్పుడు పదికి పైగా ఫైఓవర్లను నిర్మించారు. ప్రస్తుతం నగరాభివృద్ధి పథకాలలో భాగంగా కొత్త మరో పది ఫ్లైఓవర్లను నిర్మించనున్నారు. ఈ విషయమై ఇటీవలే కార్పొరేషన్ ఉన్నతాధికారులతో నగరాభివృద్ధి శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ చర్చలు కూడా జరిపారు. ఈ ఫ్లైఓవర్ల నిర్మాణానికి అవసరమైనంత నిధులను త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్‌లో కేటాయించనున్నట్లు ఆయన ప్రకటించారు. రాయపురం గణేశపురం సబ్ సమీపంలో కొత్తగా ఫ్లైఓవర్ నిర్మించనున్నామని, ఆ ప్రాంతంలో వర్షం వస్తే ప్రజలు నడచి వెళ్లేందుకు వీలుండదని, ఆ కారణంగా అక్కడ రహదారి వంతెన అవసరమైందన్నారు. వేళచ్చేరి గురునానక్ సమీపం లో వేళచ్చేరి జంక్షన్- వేళచ్చేరి బైపా్‌సరోడ్డు వద్ద, న్యూ ఆవడి జంక్షన్- అన్నానగర్ థర్డ్ అవెన్యూను కలుపు తూ ఫ్లైఓవర్లు నిర్మించనున్నట్లు చెప్పారు. నుంగం బాక్కం సబ్‌వే ప్రాంతం సహా మొత్తం 10 చోట్ల ఫ్లైఓవర్లను దశలవారీగా నిర్మిస్తామని నెహ్రూ తెలిపారు. పదేళ్ల దీర్ఘ ప్రణాళికలో భాగంగా ఈ ఫ్లైఓవర్లను త్వరితగతిన నిర్మిస్తామని, అదే సమయంలో ముఖ్యమైన రహదారులను కూడా విస్తరింపజేస్తామని ఆయన వివరించారు.