పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలన్నింటిని త్వరగా పూర్తిచేయాలని చూస్తున్నారు. అందులో భాగంగానే ఆ సినిమా షూటింగ్లకు కావలసిన డేట్స్ కూడా ఆయన అడ్జస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డైరెక్టర్ జ్యోతి కృష్ణ (Jyoti Krishna) దర్శకత్వంలో వస్తున్న ‘హరిహర వీరమల్లు – పార్ట్ 1’ షూటింగ్ పూర్తవగా.. జూన్ 12వ తేదీన ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఇప్పుడు పవన్ కళ్యాణ్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో ఓజీ (OG) సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. మరొకవైపు పవన్ కళ్యాణ్ మూవీ జాబితాలో ఉన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. అసలు ఈ సినిమా ఉండదేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా కూడా ఉందని తాజాగా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా నుంచి అప్డేట్ కూడా వదిలారు.
ఉస్తాద్ భగత్ సింగ్ నుండి అప్డేట్..
ఈ మేరకు పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త తెలుపుతూ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో కేవలం పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) చేతులు మాత్రమే కనపడేలా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అంతేకాదు ఫ్యాన్ బాయ్ ఫీస్ట్ ఫ్యాన్స్ కోసం.. మూవీ లవర్స్ కోసం రాబోతోంది త్వరలోనే షూటింగ్ మొదలు కాబోతోంది అంటూ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా ఉంటుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక పవన్ కళ్యాణ్ నుంచి రాబోయే ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలని నెటిజన్స్ కూడా ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే.
అంచనాలు పెంచుతున్న మేకర్స్..
ఇకపోతే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని , వై.రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్ అభిమానులలో అంచనాలు పెంచేస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా తమిళ్ విజయ్ (Vijay) ‘ తేరి ‘ సినిమా రీమేక్ అని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు కథ మొత్తం మార్చేసి, మళ్ళీ కొత్తగా షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి గతంలో హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ‘గబ్బర్ సింగ్’ సినిమా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మళ్ళీ వెనుతిరిగి చూసుకోలేదు. అటు ఈ సినిమాలో నటించిన శృతిహాసన్ (Shruti Haasan) కి కూడా మంచి కెరియర్ లభించిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రాబోతోందని తెలిసి అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇంకా అసలే ఉండదనుకున్న సినిమా త్వరలో షూటింగ్ మొదలుపెట్టబోతున్నామని యూవీ క్రియేషన్స్ మేకర్స్ అనౌన్స్ చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలలో బిజీగా ఉంటూనే.. మరొకవైపు ఈ మూడు చిత్రాలు పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇక ఈ సినిమా చివరి సినిమా కానుందా లేక మరో సినిమాకు సంతకం చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.