సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో..!

ప్రతి పరిశ్రమలోను వారసత్వం అనేది ఉంటూనే ఉంటుంది. కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అది ఇంకా ఎక్కువగా ఉంటుంది. దీనిని కొంతమంది సమర్థిస్తారు కొంతమంది వ్యతిరేకిస్తారు. ఏదేమైనా వారసత్వం అనేది సినిమా ఓపెనింగ్ కు మాత్రమే సరిపోతుంది. టాలెంట్ లేకపోతే ఇక్కడ ఎవరిని తెలుగు ప్రేక్షకులు రిసీవ్ చేసుకోరు. దీనికి చాలామంది నటులు ఉదాహరణగా చెప్పొచ్చు. సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి బాల్య వయసులోనే ఎంట్రీ ఇచ్చాడు మహేష్ బాబు. అప్పటినుంచి నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకొని ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మహేష్ బాబు ఒక స్టార్ హీరో. ఇప్పుడు రాజమౌళితో చేస్తున్న సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా మహేష్ బాబు స్టామినా ఏంటో తెలుస్తుంది.

 

జయ కృష్ణ ఎంట్రీ

 

సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రదర్ స్వర్గీయ ఘట్టమనేని రమేష్ బాబు గురించి చాలామందికి తెలిసిన విషయమే. తన కుమారుడు జయకృష్ణ ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం చేయనున్నారు. వైజయంతి మూవీస్ మరియు ఆనంద్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. దీని గురించి అధికారకు ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. ఇప్పటికే మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి సుధీర్ బాబు కూడా ఎంట్రీ ఇచ్చి తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు జయకృష్ణ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంతవరకు నిలబడతాడు తెలియాలి అంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.

 

బాధ్యత తీసుకున్న అజయ్ భూపతి

 

ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు అజయ్ భూపతి. కార్తికేయ గుమ్మకొండ హీరోగా పరిచయమైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు కూడా వచ్చాయి. అజయ్ భూపతి కూడా ఈ సినిమాతో దర్శకుడుగా సెటిల్ అయిపోయాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన మహాసముద్రం సినిమా ఒకటి డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఆ తర్వాత మంగళవారం సినిమాతో మంచి కం బ్యాక్ ఇచ్చాడు అజయ్. ఆ సినిమాకి సీక్వెల్ తీస్తున్నాడు అని ఊహిస్తున్న తరుణంలో ఈ కొత్త ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. ఇదివరకే కొత్త హీరోని లాంచ్ చేసిన అనుభవం ఉన్న అజయ్ ఈ సినిమాతో ఏం చేస్తాడు అనే క్యూరియాసిటీ చాలామందికి మొదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *