బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్ కన్ఫర్మ్..! ఎవరంటే..?

బిగ్ బాస్ షో గురించి మన ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది అలరించే షో అంటే బిగ్ బాస్ అని చెప్పొచ్చు. సెలబ్రిటీలు అందరూ కలిసి టెక్నాలజీకి దూరంగా సోషల్ మీడియాకు దూరంగా ఒకే దగ్గర జీవిస్తే ఎలా ఉంటుంది అని సాధారణ ప్రేక్షకులకి చూపించే షో ఈ బిగ్ బాస్. అయితే నిజ జీవితంలో సెలబ్రిటీలు ఎలా మాట్లాడుతారు ఎలా ఉంటారు వాళ్ళు ప్రవర్తించే తీరేంటి అని ఈ షో చూస్తే చాలామందికి తెలుస్తుంది. చాలామంది ఆలోచన విధానం ఈ షో ద్వారా బయటపడుతుందని చెప్పొచ్చు. ఈ షో కి తెలుగు ప్రేక్షకులు మంచి ఆదరణ చూపించారు. కొంతమంది ఫ్యాన్స్ కూడా ఈ షో కి ఉన్నారు.

 

దాదాపు ఇప్పటివరకు బిగ్ బాస్ షో కి సంబంధించి 8 సీజన్లు అయ్యాయి. ఇక 9వ సీజన్ కూడా మొదలుకానుంది. ఈ షో కి సంబంధించి మొదటి సీజన్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. ఆ సీజన్ అద్భుతంగా వర్కౌట్ అయింది ఆ తర్వాత నాని చేసిన సీజన్ 2 కూడా బాగానే వర్కౌట్ అయింది. ఒక బిగ్ బాస్ సీజన్ 3 నుంచి నాగార్జున హోస్ట్ గా ఉండడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు కూడా హోస్ట్ గా నాగార్జున కొనసాగుతున్నారు. ఇకపోతే మొదటి షో అలరించినంతగా రిమైనింగ్ సీజన్స్ ఏవి కూడా ఆకట్టుకోలేకపోయాయి. ఈ సీజన్ కి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించినన్నారు. బాలకృష్ణ , నాని వంటి హీరోలు హోస్ట్ చేస్తారు అనే వార్తలకు చెక్ పడింది.ఈ షో సెప్టెంబర్ నుంచి స్టార్ట్ కానున్నట్లు సమాచారం వినిపిస్తుంది దీని గురించి అధికారిక పెట్టన త్వరలో రావాల్సి ఉంది.

 

గెస్ట్స్ ఎవరు.?

 

బిగ్బాస్ జరుగుతున్న కొద్దీ సీజన్స్ పెరుగుతున్నకొద్దీ తెలిసిన వాళ్లకంటే కూడా తెలుసుకోవలసిన వాళ్లు ఎక్కువైపోయారు అనేటట్లుంది కంటెస్టెంట్లు పరిస్థితి. ఒక ఈ సీజన్లో ఎవరు గెస్ట్ గా వస్తారు అని అందరికీ క్యూరియాసిటీ మొదలైంది. ముఖ్యంగా కొంతమంది బిగ్ బాస్ కంటెస్టెంట్ల పైన ఈ మధ్య ఆరోపణలు కూడా చాలా వరకు వినిపిస్తున్నాయి. ఈ షో వలన పాపులర్ అయిన చాలామంది బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం వల్ల సామాన్యుల జీవితాలు చితికిపోయాయి అని చాలామంది నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఇక ఇప్పుడు ఎటువంటి కంటెస్టెంట్లు వస్తారు అనేది ఇంకొన్ని రోజుల్లో తెలియనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *