టెస్ట్ క్రికెట్ కు కోహ్లీ గుడ్ బై..!

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. తాజాగా రిటైర్ మెంట్ ప్రకటిస్తూ ఇన్‌స్టాలో భావోద్వేగభరిత పోస్ట్‌ చేశారు. భారత్‌ తరఫున కోహ్లీ దాదాపు 14 ఏళ్ల పాటు టెస్టులకు ప్రాతినిధ్యం వహించారు. ఇది తనకెంతో గర్వకారణమని కోహ్లీ చెప్పారు. 2011లో వెస్టిండీస్‌ తో మ్యాచ్ ద్వారా ఆయన టెస్టుల్లో అరంగేట్రం చేశారు. తన కెరీర్‌లో కోహ్లీ 123 టెస్టు మ్యాచ్‌లు ఆడి 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలతో మొత్తం 9,230 పరుగులు చేశారు. 2025 జనవరి 3న ఆస్ట్రేలియాతో కోహ్లీ చివరి టెస్టు ఆడారు. కాగా, ఇటీవలే రోహిత్ శర్మ కూడా టెస్ట్ క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించడం తెలిసిందే. రోహిత్ రిటైర్ మెంట్ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *