‘ఆదిత్య 999’ నుండి క్రేజీ అప్డేట్..!

నటసింహ నందమూరి బాలకృష్ణ (Natasimha Nandamuri Balakrishna) వరుస విజయాలతో తన తండ్రి పరంపర కొనసాగిస్తూ.. ముందుకు సాగుతున్నారు. అయితే బాలకృష్ణ నట వారసత్వాన్ని, ఆయన వారసుడు మోక్షజ్ఞ (Mokshagna) తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పాలి. అయితే బాలకృష్ణ మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ పై గత కొన్ని సంవత్సరాలుగా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ.. మోక్షజ్ఞ ఎంట్రీకి మాత్రం మోక్షం కలగలేదని చెప్పవచ్చు. ఇకపోతే ‘ఆదిత్య 369’ సినిమాతో మోక్షజ్ఞ ఇండస్ట్రీ ఎంట్రీ ఉంటుందని వార్తలు వినిపించాయి. కానీ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) డైరెక్షన్లో మోక్షజ్ఞ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని, అందుకు సంబంధించి ఆయన ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఇక మళ్లీ ఏమైందో తెలియదు కానీ ఆ విషయంపై ఎవరు స్పందించలేదు. ఇక దీంతో మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతలు ఎవరు తీసుకుంటున్నారు అని అభిమానులలో అనుమానాలు రేకెత్తుతున్న వేళ ఇప్పుడు ఊహించని అప్డేట్ ఒకటి తెరపైకి వచ్చింది. ఇక ఆదిత్య 369 సీక్వెల్ తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తారనుకున్నారు. కానీ ఇప్పుడు అదే సీక్వెల్ తో ‘ఆదిత్య 999’ గా బాలయ్యే చేయబోతున్నట్లు సమాచారం.

 

త్వరలో ఆదిత్య 999.. ఆయనకే బాధ్యత..

 

అయితే ఇప్పుడు ఈ సినిమాను ప్రముఖ డైరెక్టర్ క్రిష్ (Director Krish) కి బాలయ్య అప్పగించినట్లు తెలుస్తోంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం దాదాపు నాలుగు సంవత్సరాల సమయాన్ని వృధా చేసుకున్న డైరెక్టర్ క్రిష్ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చి అనుష్క (Anushka) తో ‘ఘాటీ’ అనే లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత బాలయ్యతో క్రిష్ సినిమా చేయబోతున్నారు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ‘ఎన్టీఆర్ బయోపిక్’ తర్వాత మళ్లీ వీరి కాంబో సెట్ అయినట్లు సినీ వర్గాలలో బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్కా మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. అయితే బాలయ్యతో చేయబోయే సినిమా కథ విషయంలో ఇప్పుడు క్రిష్ ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాలయ్య వద్ద ‘ఆదిత్య 999’ స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. ఆదిత్య 369 సీక్వెల్ స్వీయ దర్శకత్వంలోనే ప్రారంభించాలని బాలయ్య ఎంతోకాలంగా అనుకున్నప్పటికీ, ప్రస్తుతం ఆయనకున్న బిజీ షెడ్యూల్ వల్ల అది కుదరడం లేదు. అందుకే డైరెక్షన్ వైపు అడుగులు వెయ్యకుండా.. ‘ఆదిత్య 999’ స్క్రిప్టును డైరెక్టర్ క్రిష్ కి అప్పగించినట్లు తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు డైరెక్టర్ క్రిష్ ఆదిత్య 999 కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మరి ఈ సినిమా కోసం అయినా క్రిష్ తన సమయాన్ని వృధా చేయకుండా నిర్మిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

 

బాలయ్య సినిమాలు..

 

ఇక బాలయ్య విషయానికి వస్తే.. ఒకవైపు పొలిటిషన్ గా, మరొకవైపు నటుడిగా.. ఇంకొక వైపు హోస్ట్ గా ఇలా పలు బాధ్యతలు చేపట్టారు. మరొకవైపు బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ‘అఖండ’ సీక్వెల్ ‘అఖండ 2’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే మహాకుంభమేళాలో షూటింగ్ కొంత భాగం పూర్తయిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆదిత్య 999 షూటింగ్ ప్రారంభం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *