బాలీవుడ్ నటుడి ఇంట్లో విషాదం : తండ్రిని చివరిసారిగా చూసే అవకాశం దక్కలేదు

ముంబై : కరోనా కట్టడికి కొనసాగుతున్న లాక్ డౌన్ వల్ల అనేక మంది ఇబ్బంది పడుతున్నారు . లాక్ డౌన్ వల్ల సామాన్యులే కాక సెలెబ్రెటీలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . వివరాలలోకి వెళ్తే బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి బసంత్‌ కుమార్‌ చక్రవర్తి (95) ఇటీవలే మరణించారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయాన్ని ఆయన మనవడు, మిథున్‌ చక్రవర్తి కుమారుడు నిమిష్‌ చక్రవర్తి తెలిపారు. లాక్‌డౌన్‌ ముందు ఓ సినిమా షూటింగ్‌ నిమిత్తం బెంగళూర్‌ వెళ్లిన మిథున్‌ చక్రవర్తి లాక్‌డౌన్‌ కావడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో తండ్రిని చివరిసారిగా చూసే అవకాశం దక్కలేదట. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *