తెలంగాణ మహిళలకు మరో పథకం..!

మహిళల సాధికారత కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. వాటిలో అన్నపూర్ణ పథకం ఒకటి. సిటీలు, పట్టణాల్లో మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ పథకం. కేవలం భర్త సంపాదన మీద కాకుండా.. తమ కాళ్ల మీద నిలబడేందుకు ఉద్దేశించిన స్కీమ్. ముఖ్యంగా ఆహార వ్యాపారాలను ప్రారంభించాలనుకునే మహిళల కోసం రూపొందించబడింది.

 

స్కీమ్ ప్రధాన ఉద్దేశం

 

మహిళలకు ఆర్థిక సహాయం అందజేస్తున్న పథకాల్లో అన్నపూర్ణ కూడా ఒకటి. ఈ స్కీమ్ ద్వారా మహిళలకు 50 వేల వరకు రుణం లభిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే తమ కాళ్ల తాము నిలబడేందుకు రూపొందించిన పథకం అన్నమాట. మొదటి నెల ఎలాంటి ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు. కేవలం మూడేళ్ల(36 నెలల్లో తీసుకున్న)లో తిరిగి రుణాన్ని చెల్లించాలి.

 

ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశం. ఆహార వ్యాపారంలో మహిళలకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహించడం. 50 వేల వరకు రుణం ఇస్తారు. దీని ద్వారా వంట సామగ్రి, టిఫిన్ సర్వీస్ అవసరాలకు సంబంధించిన పనిముట్లను కొనుగోలు చేయవచ్చు. ఈ స్కీమ్ కు ప్రధాన అర్హత. మహిళలు ఈ వ్యాపారంలో 50 శాతం కంటే ఎక్కువ యాజమాన్యం కలిగి ఉండాలన్నది తొలి నిబంధన.

 

రూల్స్ ఏంటి?

 

వయస్సు 18 నుంచి 55 మధ్య వుండాలి. రాష్ట్ర ఏజెన్సీ నిర్వహించే ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో చేయబోయే వ్యాపారాన్ని నమోదు చేసుకోవాలి. మహిళ కుటుంబ వార్షిక ఆదాయం లక్షన్నర కంటే తక్కువ ఉండాలి. అందులో వితంతువులు, వికలాంగులకు మినహాయింపు.

 

ఎలా చేయాలి?

 

అన్నపూర్ణ స్కీమ్ కోసం ఈ పత్రాలు సమర్పిస్తే చాలు. ఆధార్ కార్డు, పాన్ కార్డు తప్పకుండా ఇవ్వాల్సిందే. ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ ఖాతా వివరాలు ఉండాలి. పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోతోపాటు వ్యాపార రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వాలి. సమీపంలోని అన్నపూర్ణ స్కీమ్‌ను అమలు చేసే బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థను సంప్రదించాలి.

 

అక్కడ దరఖాస్తు ఫారం తీసుకుని అవసరమైన వివరాలు పూర్తి చేయాలి. గుర్తింపు, చిరునామా, బ్యాంక్ వివరాలు, వ్యాపార పత్రాలను దరఖాస్తుకు జత చేయాలి. దరఖాస్తు, ఆ వివరాలు బ్యాంక్‌లో సమర్పిస్తే చాలు, ధృవీకరణ తర్వాత రుణం విడుదల చేస్తాయి బ్యాంకులు. ఆపై నిధులు ఖాతాలో జమ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *