స్మితా సబర్వాల్‌కు రేవంత్ సర్కార్ షాక్..!

తెలంగాణ ప్రభుత్వం 20 మంది సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను ట్రాన్స్‌ఫర్ చేసింది. రాష్ట్ర పరిపాలనా వ్యవస్థను ప్రక్షాళన చేసేలా కీలక మార్పులు చేపట్టింది. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ బదిలీ అయ్యారు. తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా ఆమె నియమితులయ్యారు. గత కొంత కాలంగా స్మిత వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్ సోషల్ మీడియా వార్ నడుస్తోంది. ఈ వ్యవహారంలో ఆమెకు నోటీసులు కూడా ఇచ్చారు. అంతే కాదు స్మితను విచారించిన పరిస్థితి కూడా ఉంది. ఈ క్రమంలో ఆమెను బదిలీ చేయడంతో చర్చనీయాంశంగా మారింది.

 

గతంలో ఇదే పోస్టులు పని చేశారు స్మితాసబర్వాల్. తిరిగి ఆమెను పాత పోస్టుకే పంపారు. బదిలీల ద్వారా.. సీనియర్- జూనియర్ అన్న తేడా లేకుండా.. అందరికీ సమాన ప్రాధాన్యతనిచ్చేలా ఒక సందేశం పంపింది తెలంగాణ ప్రభుత్వం. ఇక్కడ మరో సందిగ్ధం ఏంటంటే, ఇప్పటి వరకూ టూరిజం శాఖ కార్యదర్శిగా పని చేసిన

 

స్మిత సబర్వాల్ బదిలీ. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ బాధ్యతల నుంచి.. ప్రాధాన్యం కొరవడిన ప్రణాళికా సంఘానికి ఆమెను ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్ చేయడం IAS వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో AI జనరేటెడ్ ఫోటోను రీపోస్ట్ చేసి… ఆలిండియా సర్వీస్ కోడ్‌కు విరుద్ధంగా ఆమె వ్యవహరించారనే అభిప్రాయం ఉంది. పోలీసు నోటీసులకు వివరణ సమయంలోనూ తనని టార్గెట్ చేశారనే మీనింగ్‌లో ఆమె సమాధానం ఇచ్చారు. స్మిత సబర్వాల్ విషయంలో ఉపేక్షిస్తే మరికొందరు అధికారులూ.. అదే రీతిలో వ్యవహరిస్తారనే విమర్శలొచ్చాయి.

 

ఇదిలా ఉంటే.. తెలంగాణ కొత్త సీఎస్‌గా ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నియమితులయ్యారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం నిన్న జారీ చేసింది. సీఎస్‌గా ఉంటూనే ఆర్థికశాఖ పదవిలోనూ అదనపు బాధ్యతలు చేపడతారని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుత సీఎస్‌ శాంతికుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేస్తున్నందున ఆమె స్థానంలో రామకృష్ణారావును నియమించింది. సీఎస్ రేసులో ఆయనతో పాటు చాలా మంది ఉన్నారు. కానీ.. పని తీరు ఆధారంగా ప్రభుత్వం రామకృష్ణారావు వైపే మొగ్గు చూపింది.

 

1991 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన రామకృష్ణారావు నంద్యాలలో పుట్టారు. ఐఐటీ కాన్పుర్‌లో బీటెక్, ఐఐటీ ఢిల్లీలో ఎంటెక్ చేశారు. అమెరికా డ్యూక్‌ యూనివర్సిటీలో ఎంబీఏ చదివారు. ఉమ్మడి రాష్ట్రంలో నల్గొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ జిల్లాల్లో సబ్‌కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్‌గా పని చేశారు. గుంటూరు, ఆదిలాబాద్‌ జిల్లాల కలెక్టర్‌గా, విద్యాశాఖ కమిషనర్‌గా, ప్రణాళికాశాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. ఉమ్మడి ఏపీ విభజన ప్రక్రియలో ఆయన చురుగ్గా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిగా చేరి ఇప్పటివరకూ అదే పొజిషన్ లో ఉన్నారు. పుష్కరకాలంగా ఆర్థికశాఖ అధిపతిగా పనిచేసిన ఆయన మొత్తం 14 రాష్ట్ర బడ్జెట్లను తయారు చేశారు. ఇందులో 12 పూర్తిస్థాయి బడ్జెట్‌లు, రెండు ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్లు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *