ఏపీలో మరో కొత్త పథకం అమలు..

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో ‘మత్స్యకారుల సేవలో’ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ స్కీం కింద మత్స్యకారుల కుటుంబాలకు 20వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. ఈ పథకం వల్ల మొత్తం లక్షా 29వేల 178 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు.

 

మత్స్యకారులకు అండగా ఉంటాం: సీఎం చంద్రబాబు

 

‘మత్స్యకారులను ఆదుకోవడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత మత్స్యకారుల జీవితాల్లో దశదిశ మారింది. నేను ఊహించిన దాని కన్నా మీ సమస్యలున్నాయి. గత ప్రభుత్వం వేల కోట్ల అప్పులు చేసింది. ఆ డబ్బును ఏం చేసిందో లెక్కలు లేవు. ఆ సమస్యలు ఎలా ఉన్నా.. మిమ్మిల్ని ఆదుకోవడానికి మా వంతు ప్రయత్నం చేయడానికి ముందుకు వస్తున్నాం. గతంలో వైసీపీ ప్రభుత్వ ఫిష్ ఆంధ్ర అని చెప్పింది. రూ.300 కోట్ల ఖర్చు పెట్టింది. కానీ ఎవరి జీవితాలు మారలేదు. మత్స్యకారులకు కూటమి సర్కారు ఎళ్లవేళలా అండగా ఉంటుంది.’ అని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

 

రూ.283కోట్ల మత్స్యకార భృతి అందజేస్తున్నాం: అచ్చెన్నాయుడు

 

కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోలేదు. వారికి వైసీపీ ప్రభుత్వం కనీసం వలలు కూడా ఇవ్వలేదు. ఏపీ ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్న హామీలు అమలు చేస్తున్నాం. రూ.283 కోట్ల మత్స్యకార భృతి అందజేస్తున్నాం. మూలపేట పోర్ట్ ను అభివృద్ది చేస్తాం’ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *