విశాఖలో లోన్‌ యాప్‌ ముఠా అరెస్ట్‌..!

అమాయకులకు డబ్బులు ఎర వేస్తూ, వేధింపులకు గురి చేస్తున్నాయి లోన్‌ యాప్‌లు. అలాంటి ఓ లోన్ యాప్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు విశాఖకు చెందిన వ్యక్తి. లోన్ యాప్‌లో 3200 రూపాయలు తీసుకొని చెల్లించిన తరువాత కూడా వేధింపులు ఆగకపోవడంతో సూసైడ్ చేసుకున్నాడు. బాధితుడి భార్య ఫిర్యాదు చేయడంతో పెద్ద స్కాం గుట్టు రట్టయింది. మృతుడి వాటాప్స్ చాటింగ్ దర్యాప్తు చేస్తున్న పోలీసులు సైబర్‌ నేరగాళ్ల గుట్టు బయటపడింది. వాట్సాప్ చాటింగ్ ద్వారా ఓ పాకిస్థాని IP అడ్రస్‌ను కూడా గుర్తించారు. అంతేకాకుండా వివిధ రాష్ట్రాల బ్యాంక్ ఖాతాల నుంచి లావాదేవీలు జరిగినట్లు గమనించారు పోలీసులు.

 

ఆరుగురితో పాటు కర్నూలుకు చెందిన శ్రీనివాసరావు అరెస్ట్

 

వివిధ రాష్ట్రాల నుంచి ఆరుగురు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు, వీరికి ప్రధాన సూత్రధారి హైదరాబాద్‌కు చెందిన సాంబశివరావుగా గుర్తించారు. ఇందులో మరొక ట్విస్ట్ ఏంటంటే చైనాకు చెందిన సైబర్‌ నేరగాళ్లు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సాంబశివ రావు సైబర్ నేరగాళ్లకు 30 బ్యాంకు ఖాతాలు ఇచ్చి 12 లక్షలు తీసుకున్నాడు. అంతేకాకుండా సాంబశివరావు టెలిగ్రామ్ యాప్ నుండి సైబర్ మోసాలకు పాల్పడ్డారు చైనాకు చెందిన హంట్, ఆండీలు.

 

రూ.1,60,000 కమిషన్ ఇస్తామని ఆశ చూపించిన కేటుగాళ్లు

 

అమాయకుల బ్యాంకు ఖాతాలు ఇస్తే బ్యాంకులో జరిగిన లావాదేవీల్లో కోటి రూపాయలకు 1,60,000 కమిషన్ ఇస్తామని సాంబశివరావుకు ఆశ చూపారు సైబర్ నేరగాళ్లు. దీంతో సాంబశివరావు తన ఏడుగురు స్నేహితులు కలిసి చైనా సైబర్ నేరగాళ్లకి 132 బ్యాంక్ ఖాతాల వివరాలు అందించారు. ఈ 132 బ్యాంక్ ఖాతాల నుంచి 200 కోట్లు కొట్టేశారు చైనా సైబర్ నేరగాళ్లు. సాంబశివరావు ఈ స్కాంలో మొత్తం నాలుగున్నర కోట్ల కమిషన్ పొందాడు. సాంబశివరావు స్నేహితులు దిలీప్, సందీప్‌ల ఫోన్‌లలో 60 లక్షల రూపాయాల క్రిప్టో కరెన్సీని గుర్తించిన పోలీసులు వారందరిని అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర నుండి ల్యాప్‌ టాప్‌లు, ఫోన్లు, ATM కార్డులు, బ్యాంక్ ఖాతాలు స్వాధీనం చేసుకున్నారు.

 

బెట్టింగ్ యాప్‌కు బలౌవుతున్న యువత

 

కాగా.. బెట్టింగ్ ఉచ్చులో పడి యువత చిత్తువతోంది. కష్టపడి పనిచేయకుండా సులభంగా డబ్బులు సంపాదించేందుకు అలవాటు పడిన నేతి యువత.. బెట్టింగ్ మాయలో పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్‌కు బలై చాలా మంది యువత ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం ఈ బెట్టింగ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుంది. వేలాది మంది పిల్లలు బెట్టింగ్‌కు బానిసై.. లక్షల్లో డబ్బులు పోగొట్టుకుని.. తమ జీవితాలతో పాటు కుటుంబ సభ్యుల జీవితాలను కూడా పణంగా పెట్టి పందాలు కడుతున్నారు. వేలాది మంది యువత ప్రాణాలు కోల్పోతున్నారు.

 

వీటిని ఎవరు సృష్టించారో తెలియదు.. ఎవరు మానేజ్ చేస్తున్నారో అర్ధం కాదు

 

బెట్టింగ్ యాప్స్ యువతను అనేక రకాలుగా మోసం చేస్తాయి. వీటిని ఎవరు సృష్టించారో తెలియదు.. ఎవరు మానేజ్ చేస్తున్నారో అర్ధం కాదు. అయితే బెట్టింగ్ యాప్స్ యువతను మాయ చేసే పనిలో భాగంగా.. తొలిసారి వాళ్లకి నమ్మకం కలిగేలా చేస్తాయి. స్టార్టింగ్‌లో యూజర్లకు గెలుపు రుచి చూపిస్తాయి. అంతే కాక ఎక్కువ బోనస్ ఇస్తామని చెప్పి ఊరిస్తాయి. మాయ మాటలు చెప్పి ముందుగా ఎక్కువ డబ్బులను డిపాజిట్ చేయించుకుంటాయి. ఆ తర్వాత పలు రకాల కారణాలు చూపి డబ్బును మోసగిస్తాయి. ఇలాంటి సంఘటనలే తరుచుగా జరుగుతున్నాయి.

 

పరిష్కార మార్గాలు:

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వంటి ఫైనాన్షియల్ సంస్థల నుంచే రుణం తీసుకోవడం మంచిది.

 

ముఖ్యంగా డేటా ప్రైవసీకి ప్రాధాన్యత ఇవ్వాలి.

 

తక్షణ అవసరాలకు పదేపదే రుణం తీసుకోవడం కాకుండా, ఫైనాన్షియల్ ప్లానింగ్ నేర్చుకోవాలి.

 

మోసపూరిత యాప్‌లు గుర్తించినప్పుడు.. పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ శాఖకు వెంటనే ఫిర్యాదు చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *