‘మిషన్: ఇంపాజిబుల్ – ది ఫైనల్’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్..

హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మిషన్ ఇంపాసిబుల్: ద ఫైనల్ రెకనింగ్’. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో క్రిస్టోఫర్ మేక క్వారీ తెరకెక్కించారు. క్రిస్టోఫర్ మెక్‌క్వారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ సినిమాను మే 23న విడుదల చేయనున్నట్లు ఇటీవల టీమ్ తెలిపింది. తాజాగా విడుదల తేదీని మార్చినట్లు వెల్లడించింది. అనుకున్న సమయం కంటే ముందే ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది.

 

అంటే మే 17 న ఇది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించింది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్న మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజీల్లో భాగంగా రూపొందిన ఎనిమిదో చిత్రమిది. ఇటీవల దీని ట్రైలర్‌ను విడుదల చేయగా మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ‘ఈ ప్రపంచం మొత్తాన్ని ప్రమాదం నుంచి కాపాడాలంటే ఈథన్కు మిషన్ను అప్పగించాలి?’ అంటూ యాక్షన్ మోడ్ ల్లో సాగిన ఆ ట్రైలర్ సినీప్రియులను ఎంతో ఆకట్టుకుంది. హైలీ యాటిల్, సైమన్ పెగ్, వనేసా కార్బీ, మన్ పెగ్, ఎసై మోరల్స్, పోమ్ క్లెమెంటిఫ్, హెన్రీ క్జెర్నీ, ఏంజెలా బాసెట్, హోల్ట్ మెక్‌కాలనీ, జానెట్ మెక్‌టీర్, నిక్ ఆఫర్‌మాన్, హన్నా వాడింగ్‌హామ్, ట్రామెల్ టిల్‌మాన్, షియా విఘం, గ్రెగ్ టార్జాన్ డేవిస్, చార్లెస్ పార్నెల్, మార్క్ గాటిస్, రోల్ఫ్ సాక్సన్, లూసీ తులుగార్జుక్ వంటి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *