పహల్గామ్ ఉగ్రదాడి ఘటన.. తెలంగాణ భవన్, న్యూఢిల్లీలో హెల్ప్‌లైన్ ఏర్పాటు..

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌‌లో మంగళవారం జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో బైసారన్ పర్యాటక ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ట్రెక్కింగ్ చేస్తున్న పర్యాటకులే లక్షంగా జరిగిన ఈ దాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోగా మరో 20 మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక మృతుల సంఖ్యలో ముఖ్యంగా ముగ్గరు తెలుగువాళ్లు మృతిచెందినట్లు సమాచారం.

 

మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన ఇంటలిజెన్స్ బ్యురో అధికారి మనీష్ రంజన్ కూడా ఉన్నారు. ఆయన భార్య ఈ దాడి నుంచి క్షేమంగా బయటపడగా… వారి పిల్లలు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో అనేక రాష్ట్రాల్ల వారీతో పాటు ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. కావాలికి చెందిన మధుసుదన్ బెంగళూరులో నివాసం ఉంటున్నాడు. పహల్గామ్‌లో మధుసుదన్‌ను టెర్రరిస్టులు చంపేశారు. ఇక విశాఖ వాసి చంద్రమౌళి కూడా ప్రాణాలు కోల్పోయారు.

 

ఈ దారుణమైన ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ ప్రజల ఐక్యతకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, ఈ కష్ట సమయంలో వారి కుటుంబాలకు ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరారు.

 

ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్తల కోసం తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలోరి తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్రింద ఇచ్చిన నంబర్లకు సంప్రదించి సమాచారం పొందవచ్చు.

 

శ్రీమతి వందన:9871999044.

శ్రీ హైదర్ అలీ నఖ్వీ: 9971387500

 

ఈ ఘటనపై తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు జమ్మూ& కశ్మీర్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేస్తూ పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. అలాగే పౌర సంబంధాల అధికారి, తెలంగాణ సమాచార కేంద్రం, న్యూ ఢిల్లీ చే జారీ చేయబడినది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *