రష్యా, చైనాలు తమ మైత్రీ బంధాన్ని మరో ఐదేళ్ళు పొడిగించాయి. పశ్చిమ దేశాలతో ఉద్రికత్తతలు పెరిగిన నేపథ్యంలో ఐక్యతను ప్రదర్శించేలా 20ఏళ్ళ నాటి మైత్రీ ఒప్పందాన్ని పొడిగించినట్లు సోమవారం ప్రక టించాయి. రెండు దేశాల మధ్య పెరుగు తున్న సంబంధాల పట్ల ఇరువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో రష్యా అధ్యక్షుడు పుతిన్ వీడియో కాల్ మాట్లాడారు. మాస్కోలో 2001 జులైలో కుదిరిన మైత్రీ ఒప్పందం సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడిందని పుతిన్ పేర్కొన్నారు. రష్యా, చైనాలు చేపట్టిన విదేశాంగ విధాన ప్రయత్నాల సమన్వయం అంతర్జాతీయ వ్యవహారాల్లో స్థిరమైన పాత్ర పోషించిందని పుతిన్ పేర్కొన్నారు.