ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల అయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఎస్ఎస్‌సీ (10th Class)లో 81.14 శాతం పాసయ్యారు. 1680 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుంచి జరగనున్నాయి. మే 28తో ముగియనున్నాయి.
మార్చి 17-31 వరకు ఎస్ఎస్‌సీ పబ్లిక్ పరీక్షలు జరిగాయి. మొత్తం 3,450 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 6, 19, 275 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్టు ఆ శాఖ వెల్లడించింది. 3 లక్షల 17 వేల 939 మంది బాలురు కాగా, 3 లక్షల 05 వేల 153 మంది బాలికలు ఉన్నారు. ఇంగ్లిష్ మీడియంకు సంబంధించి 5,64,064 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. తెలుగు మీడియంలో కేవలం 51,069 మంది పరీక్షలు రాశారు. 1680 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి.
పార్వతీపురం మన్యం జిల్లా అత్యధికంగా 93.90 శాతంతో ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. ఒకవిధంగా చెప్పాలంటే ఇదొక రికార్డు. ఫలితాలను ప్రభుత్వం వైబ్ సైట్ లో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఫలితాలను వెబ్‌సైట్ https://results.bse.ap.gov.in/RES25/ , http://bse.ap.gov.in మాత్రమే కాకుండా మన మిత్ర వాట్సాప్ Send Hi 95523 00009, అలాగే LEAP Mobile App చూడొచ్చు.