సంగారెడ్డి జిల్లా, ఎల్.ఎన్ కన్వెన్షన్ హాల్లో నూతనంగా ఎన్నికైన సంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్యువల్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ సంగారెడ్డి బార్ అసోసియేషన్ నూతన కమిటీని మరియు అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ యొక్క వేడుకలను సంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులు, ప్రధాన న్యాయమూర్తులు, జీపీలు పీపీలు, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు మరియు మహిళ న్యాయవాదులు అందరూ కలిసి సంగారెడ్డి బార్ అసోసియేషన్ గొప్పతనాన్ని, ఘనతను తెలియజేస్తూ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి గారిని ఘనంగా సన్మానించారు. తదనంతరం అన్యువల్ డే సెలబ్రేషన్ వేడుకలను ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఘనంగా జరుపుకున్నారు.