ఏపీలో ఖాళీగా ఉన్న రాజ్యసభ సీటుకు నోటిఫికేషన్ ఇచ్చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. 2028 జూన్ వరకు ఆయన పదవీకాలం ఉండగానే, కొన్ని కారణాల వల్ల ఆయన రాజ్యసభ సీటు, వైసీపీకి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. ఈనెల 29 వరకు నామినేషన్ల స్వీకరణ గడువు ఉంది. మే 9న ఎన్నికల జరగనుంది. విపక్షానికి సీట్లు లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికల జరగనుంది.
ఏపీలో రాజ్యసభ, మండలిలో ఒక్క సీటు ఖాళీ అయినా కూటమిలో నేతల మధ్య గట్టి పోటీ నెలకొంది. నార్మల్‌గా టీడీపీలో పోటీ ఎక్కువగా ఉంటుంది. ఓ వైపు జనసేన, మరోవైపు బీజేపీ ఉండడంతో ఆశావహులు సంఖ్య అమాంతంగా పెరిగింది. ఇటీవల వైసీపీ, ఎంపీ పదవికి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. ఆ సీటుకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చేసింది.
ఇప్పటికే ఆశావహులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కలిసి తమకే ఇవ్వాలని రిక్వెస్టులు పెట్టుకున్నారు. నామినేషన్‌కు సమయం ఉండడంతో చంద్రబాబు-పవన్ కల్యాణ్‌లు రేపో మాపో భేటీ కావాలని నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీల నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది.