కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం.. కేంద్ర కమిటీకి తెలంగాణ ప్రభుత్వం నివేదిక..

కంచ గచ్చిబౌలి భూములపై కేంద్ర కమిటీకి తెలంగాణ ప్రభుత్వం నివేదిక సమర్పించింది. 400 ఎకరాల భూముల వ్యవహారానికి సంబంధించి పర్యావరణ, అటవీ శాఖల కేంద్ర సాధికారిక కమిటీతో తెలంగాణ ప్రభుత్వ అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులు నివేదికను అందజేశారు.

 

కంచ గచ్చిబౌలిలోని భూములను పరిశీలించేందుకు కేంద్ర సాధికారిక కమిటీ హైదరాబాద్‌కు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది. ఈ కమిటీ కంచ గచ్చిబౌలి భూముల్లో పరిశీలన జరిపి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయనుంది.

 

ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర అధికారులతో సమావేశమైంది. అంతకుముందు, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు నేతృత్వంలోని బృందం ఒక నివేదికను సమర్పించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కమిటీ సుప్రీంకోర్టుకు అందజేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *