నటుడు పోసానికి మరో బిగ్ షాక్..!

సీనీ నటుడు పోసాని కృష్ణామురళికి మరోసారి ఝలక్ ఇచ్చారు. ఆయన అరెస్ట్ ఇటు సినీ రంగంలోనే కాదు.. అటు రాజకీయాల్లో కూడా సంచలనం సృష్టించింది. పోసాని కృష్ణ మురళి రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత తనకు చాలా నెగిటివిటీ వచ్చేసింది. ముఖ్యంగా కొన్ని ప్రెస్ మీట్స్ లో పోసాని కృష్ణ మురళి మాట్లాడిన విధానం చాలామందికి నచ్చేది కాదు. చాలా అసభ్యకరమైన లాంగ్వేజ్‌ని కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి.

 

తనపై వ్యక్తిగత కోపంతోనే ఇలా ఫిర్యాదు చేశారని టీడీపీ అధికార ప్రతినిధిపై ఆరోపణలు చేశారు పోసాని. తన ఆరోగ్యం పరిస్థితి గురించి చెప్తూ.. ప్రస్తుతం తన ఆరోగ్యం బాలేదని, రెండుసార్లు ఆపరేషన్ చేసి స్టంట్లు వేశారని జడ్జితో వివరించారు. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత పోసానికి 14 రోజులు రిమాండ్ విధించారు. అలా పోసానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.

 

ప్రస్తుతం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌పై పోసాని అనుచిత వాఖ్యలు చేశారు. దీనిపై నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట పోలీస్ స్టేష‌న్‌లో కేసు నమోదైంది. దీంతో పోసానికి సూళ్లూరుపేట పోలీసులు నోటీసులు జారీ చేయడంతో.. పోసాని కృష్ణమురలి ఈనెల 15న విచారణకు రావాలని నోటీసుల్లో తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *