కరీంనగర్ సిగలో ఆకర్షణీయంగా నిలిచేందుకు తీగల మణిహారం సిద్ధమయ్యింది. త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో… అధికారులు చురుకుగా పనులను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వంతెనపై లోడ్ టెస్ట్ కొనసాగుతుండగా… మరోవైపు అప్రోచ్ రోడ్ల నిర్మాణం పనులు సైతం వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఐదు రోజుల పాటు లోడ్ టెస్టింగ్ కొనసాగనుంది. వంతెనపై 28 టిప్పర్లలో 840 టన్నుల ఇసుక, ఫుట్ పాత్‌ల పై మరో 110 టన్నుల ఇసుకను ఉంచి వంతెన సామర్థ్యాన్ని అధికారులు పరిక్షిస్తున్నారు. లోడ్ టెస్ట్ పూర్తై… అప్రోచ్ రోడ్లు పూర్తైతే… త్వరలోనే కేబుల్ బ్రిడ్జ్‌పైకి పర్యాటకులను అనుమతించనున్నారు. పైన కేబుల్ బ్రిడ్జ్… కింద మానేర్ రివర్ ఫ్రంట్ నీరు డైనమిక్ లైటింగ్ సిస్టమ్, దక్షిణాదికే ముఖద్వారంగా కేబుల్ బ్రిడ్జ్ నిలువనుంది. కరీంనగర్ సిగలో తీగల మణిహారంగా నిలిచేందుకు… త్వరలోనే కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ అందుబాటులోకి రానుంది. ఇలాంటి కేబుల్ బ్రిడ్జ్‌లో ఉత్తర భారతదేశంలోని హౌరా… ముంబైలలో రెండు ఉండగా… దక్షిణ భారతంలోనే తొలిసారి… దేశంలో 3వ కేబుల్ బ్రిడ్జ్ జిల్లాలో నిర్మితమవుతోంది.