కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు ఆటలు రద్దవడమే చూశాం కానీ ఈ మహమ్మారి పుణ్యమా అని ఆట కొత్త పుంతలు తొక్కుతోంది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆన్‌లైన్ చాంపియన్‌షిప్‌లు పుట్టుకొస్తున్నాయి. ఆటలో ఈ సాంకేతిక విప్లవానికి ఏప్రిల్ 15న జరుగనున్న ఇంటర్నేషనల్ ఆన్‌లైన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌తో తెర లేవనుంది. ఎలక్ట్రానిక్ టార్గెట్ బోర్డ్, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ సహాయంతో ఇళ్ల నుంచే తమ లక్ష్యాలకు గురిపెట్టేందుకు షూటర్లంతా సిద్ధమయ్యారు. భారత్ నుంచి మను భాకర్, సంజీవ్ రాజ్‌పుత్, దివ్యాన్‡్ష సింగ్ పన్వర్ ఈ కొత్త విధానంలో తమ నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు. భారత మాజీ షూటింగ్ నిపుణుడు (మార్క్స్‌మ్యాన్) షిమోన్ షరీఫ్ చొరవతో బీజం పడిన ఈ ఆన్‌లైన్ చాంపియన్‌షిప్‌లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 50 మంది షూటర్లు పాల్గొననున్నారు.