11రోజుల్లో 12 బిల్లులు, మూడు తీర్మానాలు..!

తెలంగాణా శాసన సభా సమావేశాలు రాష్ట్ర ద్రవ్య వినియోగ బిల్లు 2025 ను ఆమోదించిన అనంతరం గత రాత్రి పొద్దుపోయాక నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 12న ప్రారంభం అయిన బడ్జెట్ సమావేశాలు 11రోజులలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ఆమోదించటంతో పాటూ, 12బిల్లులను, మూడు తీర్మానాలనూ ఆమోదించారు. ఈ సమావేశాల్లో 142 ప్రసంగాలు జరిగాయి, అధికార ప్రతిపక్షాల మధ్య వాద ప్రతివాదాలు, వాడి వేడి చర్చలు సాగాయి.

 

మూజువాణీ ఓటుతో ద్రవ్య వినియోగ బిల్లు 2025 ఆమోదం

ప్రధానంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, అప్పులపై చర్చ సాగింది. మొత్తం 12రోజుల్లో 97 గంటల పైగా వివిధ కార్యకలాపాలను శాసనసభ నిర్వహించింది. 3 లక్షల 5 వేల కోట్ల రూపాయిల పైగా అంచనా వ్యయంతో వచ్చే ఆర్ధిక సంవత్సరం 2025-26 కు బడ్జెట్ ను ఆమోదించింది. ఇందుకు అవసరమయిన ద్రవ్య వినియోగ బిల్లు 2025 ను అధికార ప్రతిపక్షాల సభ్యులు తీవ్ర వాదోపవాదల మధ్య మూజు వాణీ ఓటుతో ఆమోదించింది.

 

సభలో ఈ బిల్లులకు ఆమోదం

సమావేశాల్లో కొన్ని కీలక బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించారు. తెలంగాణ వెనుక బడిన తరగతుల, గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల రిజర్వేషన్ల్ బిల్లు 2025, స్థానిక సంస్థలు, ఉద్యోగ విద్యారంగాల్లో వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ మరో బిల్లునూ ఆమోదించింది. ఇంకా తెలంగాణా షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్ల హేతుబద్దీకరణ బిల్లు 2025 ద్వారా SC లో 59 కులాల వర్గీకరణ కు ఆమోదం తెల్పింది.

 

మానవ అవయవాలు కణజాల చట్టానికి ఆమోదం

కేంద్ర చట్టాలకు అనుగుణంగా, మానవ అవయవాలు-కణజాల చట్టం 2025 కూ ఆమోదం తెలిపి, అవయవ మార్పిడి చట్టాలను కేంద్ర చట్టాలకు అనుగుణంగా మార్పులు చేసేందుకు మార్గం సుగమం చేసింది. కొన్ని గ్రామాలను మునిసిపాలిటీలలో విలీనం చేసి పాలన సౌలభ్యాన్ని మెరుగు పరచటానికి పురపాలక, పంచాయితీ రాజ్ చట్టాలలో మార్పులు ప్రతిపాదించిన బిల్లులను కూడా ఆమోదించింది.

 

డీలిమిటేషన్ పై తీర్మానం

BRS సభ్యులు జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గాను సమావేశాలనుంచి సస్పెండ్ అయ్యారు. ఇక డీలిమిటేషన్ విధి విధానాలను దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలుగని విధంగా మార్చాలనీ కేంద్రాన్ని కోరుతూ శాసన సభలో డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. బంజారా, లంబాడ ప్రజలు మాట్లాడే గోర్ బోలి భాషను రాజ్యాంగం 8 వ షెడ్యూలులో చేర్చాలని ప్రతిపాదిస్తూ మరో తీర్మానం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *