ఏపిలో సూర్య ఘర్ స్కీమ్..! ఎప్పుడంటే..?

ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై ఫోకస్ చేసింది చంద్రబాబు సర్కార్. 2027 నాటికి కోటి ఇళ్లకు సోలార్ విద్యుత్ అందించడమే లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని 20 లక్షల ఇళ్లకు ఈ ఏడాది సౌర విద్యుత్ సౌకర్యం కల్పించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ లక్ష్యం కూడా అదేనని తెలిపారు.

 

ఈ స్కీమ్‌తో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకే కాకుండా బీసీల ఇళ్లకు ఆర్థిక వెలుగులు రానున్నాయి. బీసీలకు కేంద్రం ఇచ్చే రాయితీకి అదనంగా రూ. 20 వేల రాయితీని ప్రకటించారు సీఎం చంద్రబాబు. 2 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకుంటే బీసీలకు మొత్తంగా రూ. 80,000 లు రాయితీ రానుంది. ఒక్కమాటలో చెప్పాలంటే సోలావ్ విద్యుత్ ఉపయోగించడం వల్ల విద్యుత్ బిల్లులు దాదాపుగా ఉండవు.

 

విద్యుత్ బిల్లు లేకపోవడంతో ఆ ఫ్యామిలీ ఆదాయం పెరుగుతోందని చంద్రబాబు సర్కార్ చెబుతోంది. గతవారం ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. స్వర్ణాంధ్ర విజన్‌-2047 కలను సాకారం చేసుకోవటంలో బ్యాంకులు భాగస్వాములు కావాలన్నారు.

 

ఒక్కో ఇంటిపై 2 కిలోవాట్ల సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తారు. లబ్ధిదారులపై భారం పడకుండా ప్రతి నెలా కొంత మొత్తాన్నిప్రభుత్వమే చెల్లించనుంది. సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు కోసం ఇప్పటికే సర్వే పూర్తి చేసింది. ఒక్కో ఇంటిపై 2 కిలోవాట్ల సౌర విద్యుత్ పలకలు ఏర్పాటుకు సుమారు లక్ష 15 వేల రూపాయలు ఖర్చవుతుందన్నది ఓ అంచనా. అందులో సగానికిపైగా కేంద్రం రాయితీ ఇవ్వనుంది. ఏపీ ప్రభుత్వం కొంత మొత్తం భరించనుంది.

 

పీఎం సూర్య ఘర్‌ యోజన పథకం 3 రకాల సామర్థ్యంతో సోలార్‌ రూఫ్‌టాప్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. మూడు కిలోవాట్ల సామర్థ్యం ఉన్న రూఫ్‌టాప్‌ వ్యయం రూ.1.95 లక్షలు అవుతుంది. అందులో రాయితీ రూ.78,000లు రానుంది. అదే రెండు కిలోవాట్లయితే రూ.1.40 లక్షలు. రాయితీ పోగా రూ.60,000లు వర్తిస్తుంది. ఒక కిలోవాట్‌ కి రూ.70,000లు వ్యయం అవుతుంది. ఇందులో రూ.30,000ల రాయితీ లభిస్తుంది. ఈ రాయితీకి అదనంగా రూ.20,000లను బీసీలకు రాయితీగా ఇస్తోంది చంద్రబాబు సర్కార్.

 

మరోవైపు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తోంది. ఈ పథకం కింద ప్రతి నెలా రూ.200 కోట్లను డిస్కంలకు సబ్సిడీ రూపంలో చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీల ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి సబ్సిడీ కింద చెల్లిస్తున్న మొత్తాన్ని ప్రాజెక్టు కోసం ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ప్రాజెక్టు అమలు కోసం డిస్కంలు రుణాలు తీసుకోనున్నాయి. తీసుకున్న రుణం నెల వాయిదాను ప్రభుత్వమే చెల్లించనుంది. సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకున్నందుకు ప్రతీ నెలా రూ.200 చొప్పున ఆదాయం లభిస్తుంది.

 

ప్రయోజనాలు

 

గృహ యజమానులకు సౌర ఫలకాలను అమర్చడానికి 40 శాతం వరకు సబ్సిడీ

12 ప్రభుత్వ రంగ బ్యాంకులు సబ్సిడీ వడ్డీ రేటుతో రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా రుణాలు ఇవ్వనున్నాయి.

రూ. 78,000 వరకు సబ్సిడీ వస్తుంది

సంవత్సరానికి కేవలం 6.75% వడ్డీ రేటుతో రూ. 6 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు

రూ. 2 లక్షల రుణాలకు ఎలాంటి ఆదాయ పత్రాలు అవసరం లేదు

మొత్తం ఖర్చులో 90 శాతం బ్యాంకు ఫైనాన్స్ సదుపాయం కలదు

 

ఎవరు అర్హులు

 

భారతీయడై ఉండాలి

సౌర ఫలకాలను ఏర్పాటుకు పైకప్పు ఉన్న ఇల్లు ఉండాలి

విద్యుత్ కనెక్షన్ ఉండాలి

సౌర ఫలకాలను సంబంధించిన ఎలాంటి ఇతర సబ్సిడీలను పొంది ఉండ కూడదు

 

దరఖాస్తు విధానం

 

వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయగానే కన్స్యూమర్ ట్యాబ్‌కి వెళ్లి అప్లై నౌ ఐకాన్‌ను ఎంచుకోవాలి

మొబైల్ నెంబర్‌తో లాగిన్ అవ్వాలి. పేరు, రాష్ట్రం, ఇతర వివరాలను అందించాలి

ఈ-మెయిల్ ఐడీని ఓకే చేసిన తర్వాత మీ ప్రొఫైల్‌ను సేవ్ చేయాలి

విక్రేత కోసం అవసరాన్ని బట్టి అవును లేదా కాదు సెలక్ట్ చేయాలి

సోలార్ రూఫ్‌ టాప్ కోసం అప్లై చేసుకోండిపై క్లిక్ చేయాలి

రాష్ట్రం, జిల్లా డిస్కామ్ వంటి ఇతర వివరాలను అందించాలి

అన్ని పూర్తి చేసిన తరువాత మీ బ్యాంక్ వివరాలను ఇవ్వాలి

మీ సబ్సిడీ మంజూరైన తర్వాత సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *