బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న బయ్యా సందీప్ అరెస్టు..! అడ్డదారులు తొక్కితే అంతేనా..?

ప్రముఖ యూట్యూబర్ బయ్యా సందీప్, అలియాస్ సన్నీపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అమాయక ప్రజలను బెట్టింగ్ యాప్స్ వైపు మళ్లిస్తున్నాడని సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొన్నేళ్లుగా బైక్ రైడ్స్ చేస్తూ యూట్యూబ్ లో పెద్ద సంఖ్యలో బయ్యా సందీప్ సబ్ స్క్రబర్స్ ను సంపాదించుకున్నారు.

 

బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న బయ్యా సందీప్

 

అయితే, బయ్యా సందీప్ యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ బెట్టింగ్ యాప్స్ ను కూడా ప్రమోట్ చేయడం మొదలుపెట్టాడు. తక్కువ పెట్టుబడితో సులభంగా డబ్బులు సంపాదించవచ్చని తన యూజర్స్ కు చెప్పుకుంటూ యాప్ ప్రమోట్ చేయడం కొనసాగించాడు. సన్నీ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అమాయక ప్రజలను బెట్టింగ్ యాప్స్ వైపు మళ్లిస్తున్నాడు. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేశారు.

 

ఎక్స్ వేదకగా వీసీ సజ్జనార్ ఫిర్యాదు..

 

బయ్యా సందీప్ అలియాస్ సన్నీ యాదవ్ తన సోషల్ మీడియా అకౌంట్లలో (టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్) ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ వీడియో పోస్ట్ చేశాడని TGRTC ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ (X) వేదికగా ఫిర్యాదు చేశారు. కాగా బయ్యా సందీప్ గత కొన్ని సంవత్సరాలుగా యూట్యూబ్ లో వీడియోలు చేస్తున్నాడు. బైక్ రైడ్ వీడియోలతో దేశాలు తిరుగుతూ.. చాలా మంది సబ్‌స్క్రైబర్‌లను సంపాదించుకున్నాడు. అయితే అతడు మరింత సంపాదించాలనే ఉద్దేశంతో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ నిర్వహకులతో కుమ్మక్కయ్యాడని వీసీ సజ్జనార్ ఆరోపించారు. తక్కువ పెట్టుబడి పెట్టి ఈజీగా డబ్బు సంపాదించాలని ఆశ చూపి బెట్టింగ్ యాప్‌లలో ఇన్వెస్ట్ చేయమని తన సబ్‌స్క్రైబర్‌లను ఆదేశించాడని తెలిపారు. ఇలా బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించడం ద్వారా బయ్యా సందీప్ యువతను తప్పుదారి పట్టిస్తున్నాడని చెప్పుకొచ్చారు. బెట్టింగ్ యాప్ ల వల్ల యువత ఆత్మహత్యకు దారితీస్తుందని సజ్జనార్ పేర్కొన్నారు.

 

పలు సెక్షన్ల కింద కేసు నమోదు

 

అయితే, వీసీ సజ్జనార్ పోస్టుపై సూర్యాపేట జిల్లా పోలీసులు స్పందించారు. వీసీ సజ్జనార్ ఫిర్యాదుతో జిల్లా కమిషనరేట్‌లోని నూతన్‌కల్ పోలీస్ స్టేషన్‌లో బయ్యా సందీప్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదైంది. ఐటీ చట్టం (2000-2008)లోని 111(2), 318(4), 46, r/w 61(2) BNS, 3, 4 TSGA, 66-C, 66-Dతో సహా అనేక సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

 

బెట్టింగ్ యాప్‌ల వల్ల ఆత్మహత్యలు

 

రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవలే యూట్యూబర్ నానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అతడు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికి అయినా బెట్టింగ్ యాప్ ప్రమోట్ యాప్ లు ప్రమోట్ చేయడం మానేయాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్ ల వల్ల యువత ఆత్మహత్య చేసుకునేందుకు దారి తీస్తుందని.. కుటుంబమంతా రోడ్డు పైనే పడే పరిస్థితి వస్తుందని చెబుతున్నారు. అసలు ఈ బెట్టింగ్ యాప్ లను బ్యాన్ చేయాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *