తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ హైవే భూసేకరణపైన రచ్చ కొనసాగుతుంది. రైతులు గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం తాము ఇచ్చే భూములకు ప్రభుత్వం ఇస్తామని చెప్పిన పరిహారం సరిపోదని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో నింద కేంద్రం పైన వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, అయితే రాష్ట్ర ప్రభుత్వమే రైతుల విషయంలో సానుకూలంగా లేదని బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
గ్రీన్ ఫీల్డ్ హైవే భూసేకరణ విషయంలో రచ్చ
కేంద్ర ప్రభుత్వం వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టు గ్రీన్ ఫీల్డ్ హైవే భూసేకరణ పరిహారం విషయంలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. రైతులు నిరసనలు చేస్తూ భూసేకరణను అడ్డుకుంటున్నారు.
గ్రీన్ ఫీల్డ్ హైవే భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం తక్కువ పరిహారం నిర్ణయించటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు వాపోతున్నారు. అయితే నేషనల్ హైవే కోసం సేకరించే భూములను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని, ఇందుకు కేంద్రం డబ్బులు చెల్లిస్తుంది.
రైతుల డిమాండ్ ఇదే
రాష్ట్రప్రభుత్వం సరైన ధర నిర్ణయించి కేంద్రానికి పంపాలని రైతులు కోరుతున్నారు. అయితే కేంద్రమే పరిహారం విషయంలో నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ప్రభుత్వం , రాష్ట్రమే రైతులకు అన్యాయం చేస్తుందని కేంద్రం చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరిహారం విషయంలో కేంద్రంపై అపవాదు వేయడం సమంజసం కాదు
తెలంగాణ రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, లేదంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని చెప్తున్న రైతాంగానికి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తమ మద్దతు తెలిపారు. భూసేకరణ కోసం కలెక్టర్లతో కమిటీ వేసి ప్రాంతాలవారీగా వాస్తవ ధరలు నిర్ణయించాలని, ఆ నివేదికను కేంద్రానికి పంపాలని వారు చెప్తున్నా రాష్ట్రం మాత్రం ఈ విషయంలో స్పందించటం లేదని అంటున్నారు.
పరిహారం నష్టం కలగకుండా ఇస్తేనే భూములు ఇస్తామన్న రైతులు
తెలంగాణా రాష్ట్రంలో హైవేల నిర్మాణం కోసం కేంద్రం దూకుడుగా ముందుకు వెళ్తుందని బీజేపీ నేతలు చెప్తుంటే, ఏ ఇబ్బంది అయినా కేంద్రం వల్లే వస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఏది ఏమైనా తెలంగాణా ప్రగతి కోసం నిర్మాణం చేస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే విషయంలో రెండు ప్రభుత్వాల మధ్య వివాదం పరిష్కారం కావాలని, రైతులకు నష్టం కలగకుండా చూడాలని భూములను ఇవ్వం అంటున్న రైతులు కోరుతున్నారు. పరిహారం నష్టం కలగకుండా ఇస్తేనే భూములు ఇస్తామని అంటున్నారు.